భారతదేశం గర్వించదగ్గ నటుల్లో చిరంజీవి గారు ముందు వరుసలో వుంటారనేది నిర్వివాదాంశం. జాతీయపటంలో తెలుగు సినీ పరిశ్రమని ప్రస్ఫుటంగా నిలబెట్టిన గాడ్ ఫాదర్ చిరంజీవి గారు. నాలుగు దశాబ్దాలుగా పరిశ్రమకి రారాజు మెగా స్టార్!
స్పందించే మనసు, ఆపదలో వున్నవారిని ఆదుకునే స్వభావం, రక్తం దొరకక ఏ ఒక్క ప్రాణం పోకూడదు అనే ఆశయం, కంటి చూపుకి నోచుకోని వారికి చూపునందించాలనే తాపత్రయం, ఆఖరికి కరిచిన పాముకి కూడా సాయం చేసే సుగుణం,.. ఆయన్ని కోట్లాదిమందికి ఆరాధ్య దైవంగా మార్చింది. శ్రమని మాత్రమే నమ్ముకుని ఆకాశమే హద్దుగా ఎదిగినా ఏనాడూ నేల విడిచి సాము చేయలేదు. ఎదిగినకొద్దీ ఒదిగి వుండాలి అని నేర్పిన మహానుభావుడు పద్మవిభూషణ్ శ్రీ చిరంజీవి గారు.
ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అనడానికి నిలువెత్తు సాక్ష్యం అన్నయ్య చిరంజీవి.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ తెలుగు వారందరికీ చిరంజీవి 70వ జన్మదిన శుభాకాంక్షలు!! 💐 💐
- @sree_n_r
Comments
Post a Comment