Prologue: Millennials మిస్సయింది ఏంటంటే థియేటర్లలో పవన్ కళ్యాణ్ మాస్ హిస్టీరియా ఎలా ఉంటుంది అనేది ప్రత్యక్షంగా చూడలేక పోవడం.
పవన్ కళ్యాణ్ అనే ఒక unassuming person నన్ను ఎలా ఆకట్టుకున్నాడు, ఎలా నాలాంటి కోట్లాది మందిని అలరించాడు, ప్రభావితం చేసాడు అనేది పంచుకోవాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది నాలాంటి లక్షల మంది (if not crores) ఇదే అనుభూతి పొందివుంటారు. అరె నిజమే, నేనూ ఇలాంటివి కొన్ని ఫీలయ్యాను అని ఒక్కరు అనుకున్నా సంతోషం. ఇక చదవండి.
మెగా స్టార్ చిరంజీవి మకుటంలేని మహారాజులాగా తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలుతున్న రోజులు. చాన్నాళ్లు న్యూస్ లో నానిన తరువాత ఫైనలుగా వాళ్ళ తమ్ముడు మొదటి సినిమా రిలీజయ్యింది. అప్పటికే వచ్చి సక్సెస్ అయిన వారసులని చూసి తెస్తున్నట్లున్నారు. పెద్ద తమ్ముడు నాగబాబుని ఇంకొంచెం ప్రమోట్ చేసి నిలబెట్టాల్సింది అనుకున్నా. నిజానికి నాకు నాగబాబు హైటూ స్క్రీన్ ప్రెజన్స్ బాగా నచ్చుతాయి. ఈ సినిమాలో స్టంట్లు, వ్రేళ్ళపైన కార్లు పోనియ్యడం, ఫైట్లు చేయడం చూసిన జనాలు బానేవుంది అన్నారు గానీ పెద్దగా ఎక్కలేదు. నేనైతే సినిమా చూడలేదుకూడా. తరువాతెప్పుడో టీవీలో చూసాననుకోండి. పర్సనల్ గా వారసత్వ నటులకి నేను పెద్ద ఫ్యాన్ కాదు.
గోకులంలో సీత చూసి బానేవున్నాడు, క్యారెక్టర్ బాగుంది, బాగానే చేస్తున్నాడు అనుకున్నాను. హెయిర్ స్టైల్ అయితే చాలాబాగా నచ్చింది. (వూ అంది పిల్ల.. సాంగ్ చూడండి, youtube.com/watch?v=CUnmh_vzrD8). మంచి స్టోరీ, సెంటిమెంటు బాగుంది, సినిమా బాగా ఆడింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడు అనుకున్నా.
సుస్వాగతం జనాలకి పిచ్చపిచ్చగా నచ్చింది. నేను ఎప్పుడో లేటుగా చూశాను బాగానే వుంది అనుకున్నాను. ఫ్రెండ్స్ అయితే నీకు టేస్ట్ లేదు ఇంతగొప్ప మూవీని బాగానేవుంది అంటావా అని కోప్పడడం కూడా జరిగింది. వాళ్లలో చాలామంది చిరంజీవి ఫాన్స్ కూడా కాదు. ఇంకా చెప్పాలంటే haters. తమిళ్ లో ఒరిజినల్ (లవ్ టుడే) కూడా పేద్ద హిట్. సేఫ్ గా వెళ్తున్నాడనిపించింది.
తొలిప్రేమ రిలీజయ్యింది ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాము. 5 నిమిషాలలో అందరూ "బాలూ, ఫామిలీ అండ్ ఫ్రెండ్స్" కి కనెక్ట్ అయిపోయారు. ప్రతి సీనూ, ప్రతి పాటా అద్భుతం. ప్రతి పాత్రా, సహజంగా బిహేవ్ చేస్తాయి. అనవసరమైన సన్నివేశం గానీ, పాత్ర గానీ కనబడవు. పవన్ అంటే ఇష్టం మొదలయ్యింది. అంతా క్రొత్త వాళ్ళే తీశారు, అందరూ వద్దన్నా పవన్ ఈ సినిమా చేశాడు, ఇలా రకరకాల మాటలు వినబడ్డాయి. ఇతని టేస్ట్ చాలాబావుంది అనిపించింది. తెలుగులో అప్పటివరకు "Boy next door" లేడు. "He is the original boy next door of Telugu movies" ప్రతి కుర్రాడు "బాలూ"లో తనని చూసుకున్నాడు. నేను ఇప్పటికీ చిరంజీవి ఫ్యాన్నే జస్ట్ పవన్ అంటే ఇష్టం మాత్రమే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. కానీ తెలుగు సినిమాలలో పవన్ శకం మొదలయ్యింది అనేది ఎవరూ కాదనలేని నిజం.

Trend setter: ఈ సినిమాతో ప్రతివాళ్ళు ఒక తమిళ్ డైరెక్టర్ని తెచ్చి సినిమా చేయడం. ఎన్ని ఆడాయో మనమే చూశాం.
నా శాడిజం: ఈ సినిమాని నా మిగిలిన ఫ్రెండ్స్ ఒక్కొక్కరితో ఒక్కోసారి చూసాను. సినిమాలో పవన్ లోయలో పడిపోవడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఒకవేళ ఆ ఫ్రెండు ఇంతకుముందు సినిమా చూడకపోతే వాడికి ఇక పవన్ చనిపోతాడు, సెకండ్ హాఫ్ లో పవన్ ఆత్మ ఆ అమ్మాయి చుట్టూ ప్రేమతో తిరుగుతూ వుంటుంది అని చెప్పేవాడిని. ఆల్మోస్ట్ అందరు దీన్ని నమ్మి ఇంత మంచి సినిమాని ఆలా ఎలా చెడగొట్టాడు డైరెక్టరు (కరుణాకరణ్) అని తిట్టుకొంటూ భారంగా సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్లేవారు. తరువాత నాకు పడేవనుకోండి. Some prank 😇
ఫైనల్ గా, ఈ సినిమా ఎన్ని సార్లు చూశానో నాకే తెలీదు. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిగా మారిపోయానో కూడా తెలీదు. అప్పట్నుంచీ చిరు అంటే ఇష్టం. పవన్ అంటే ప్రేమ.

నేను ఎలా వుండాలనుకుంటానో ఏ ఆదర్శాలను ఇష్టపడతానో అది బ్రతికి చూపిస్తున్న టార్చ్ బేరర్ మన పవన్ కళ్యాణ్ 💕🙏
Comments
Post a Comment