Take 1
ఛెళ్ళ్ మంటూ శబ్దం వినబడింది, సూదులతో గుచ్చినట్టు చెంపంతా మంట, తడిగా జిగటగా పెదవి నుంచి కారుతున్నట్టు తెలుస్తుండగా నొప్పికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాను. దెబ్బకి పెదవి చిట్లి రక్తం కారుతుంది. కళ్ళు బరువుగా వున్నాయి, తల పగిలిపోతుంది, గొంతెండిపోయింది. కొంచెం నీళ్లు కావాలి.
"మళ్ళీ మొదలు పెడదాం, ఎవరు నువ్వు 'వినిపెగ్'లో ఏం చేస్తున్నావ్?" కర్కశంగా అడిగాడు. సన్నగా చిన్నగా వున్నాడు, కానీ వెనుక బౌన్సర్ల లాగా ఇద్దరున్నారు.
"మీరెవరు, నేనెక్కడ వున్నాను?" కొద్దిగా స్పృహ వస్తుండగా నీరసంగా అడిగాను. కుర్చీలో కూర్చోబెట్టి రెక్కలు వెనక్కి విరిచి కట్టేశారు. అసలు ఎవరు వీళ్ళు? నన్నెందుకు కట్టేశారు?
"ఇలా లాభం లేదు" అంటూ ఆ బౌన్సర్లు ఇద్దరూ విరుచుకు పడ్డారు. ఓ ఐదు నిముషాలపాటు భీకరంగా కొట్టారు. నేను గట్టిగా అరుస్తున్నాను. నన్ను కొట్టకండి, వదిలేయండి అని వేడుకుంటున్నాను. లాభం లేకపోయింది.
"స్టాప్ ఇట్" అన్నాడు ఆ సన్నని చిన్నని మనిషి విసుక్కుంటూ. "సైంటిఫిక్ పద్ధతులు వుండగా ఈ మొరటు హింసలు ఎందుకు" అనడుగుతూ ఒక ఇంజక్షన్ తీసి నాకు చేసేశాడు. నెమ్మదిగా మత్తు ఆవరించింది నొప్పి తెలియడం లేదు. ఎందుకో కారణం తెలియకపోయినా హాయిగా సంతోషంగా వుంది.
"ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" మృదువుగా అడిగాడు. బాగా కావాల్సిన బంధువు లేక మిత్రుడు ఎన్నో ఏళ్ళకి కనబడి క్షేమ సమాచారం అడిగినట్టు అనిపించింది, నాకు తెలియకుండానే చెప్పేయడం మొదలు పెట్టాను.
నా పేరు రాజీవ్ భాటియా. భటిండా మాది, నేను కార్పెట్స్, షాల్స్, తయారు చేసే పెద్ద కంపనీలో మిడిల్ ఈస్ట్ డివిజన్ మొత్తానికి మార్కెటింగ్ హెడ్ ను. నా భార్య శీతల్, నోయిడా లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్చార్ మేనేజర్. మాకో పాప వుంది, పూజ భాటియా, 8th క్లాస్ చదువుతుంది. నా జాబ్ నిమిత్తం నేను ఈజిప్టు, సౌదీ, ఇరాన్, లెబనాన్, కతర్, యిలా అన్ని దేశాలు తిరుగుతూ వుంటాను.
ఒక అనుకోని సంఘటన వల్ల ఓ భయంకరమైన నిజం బయటపడింది. ఎవడో తానొక సీక్రెట్ ఏజెంటుని అని నమ్మించి, దేశ రక్షణ కోసం కొందరు ఇంటి దొంగలని పట్టుకోవడానికి సాయం చేయమని నా భార్యని ఒప్పించాడు. ఈమె కూడా దేశం కోసం, ధర్మం కోసం అని నమ్మేసి వాడి ట్రాప్లో పడిపోతుంది అని తెలిసింది. మేం ఇన్వెస్టిగేట్ చేస్తే వాడొక సెకండ్ హ్యాండ్ కార్ల సేల్స్ మాన్, నా భార్యని గోకుతున్నాడు అన్న విషయం తెలిసింది. ఆమెని కాపాడడానికి నేనూ నా మిత్రుడూ నిర్ణయించుకున్నాం. నిజానికి మేము అండర్ కవర్ 'రా' ఏజెంట్లము, ఈ విషయం నా భార్యకి కూడా తెలియదు. ఆమెని ఫాలో అవుతూ లీలా పాలస్ కి వెళ్ళాం. వాడు తనని అప్రోచ్ అవుతుండగా వాడిని పట్టుకుని అరెస్టు చేసేశాం. మా టీం వాడిని పట్టుకుపోయాక, నేను నా భార్యతో వుండగా వీళ్లెవరో నా మీద ఎటాక్ చేసి తీసుకొచ్చేశారు.
నా భార్య ఎక్కడ, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు, చెప్పండి అని అడిగాను. ఇంతలో ఓ మూల నుంచి కిసుక్కు మని చిన్న నవ్వు వినబడింది. తల తిప్పి చూశాను, నాతొ పాటూ ఆ మనిషి కూడా.. ఓ అమ్మాయి ఆ గదిలో మూల టేబుల్ ముందు కూర్చుని పంటి కింద నవ్వుని తొక్కి పట్టి మోనిటర్లో చూస్తూ కనబడింది.
"ఈ అమ్మాయి భలే బావుంది" మనసులో అనుకున్నాను అనుకుంటూ బయటకే అనేశాను, ఇంజక్షన్ ప్రభావం అనుకుంటా. ఆ వ్యక్తి నా వైపు చురుగ్గా చూసి తల తిప్పి కోపంగా ఆమెని ఏమైందని అడిగాడు. "నథింగ్ సర్" అంది కొంచెం కంగారు పడుతూ, ఫర్లేదు చెప్పు అన్నాడు. "ట్రూ లైస్" కథ చెబుతున్నాడు సర్ అంది. 90ల్లో వచ్చిన అర్నాల్ ష్వార్జ్నెగ్గర్ సినిమా కథ సర్ అది అని చెప్పింది ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న అతనితో.
నా అయోమయం మరింత పెరిగింది. నిజంగానే నాకర్ధం కాలేదు. నా కథతో ఇలా ఓ సినిమా తీశారా? లేదు, 90ల్లో సినిమా అంటుందిగా, ఆ సినిమాలో చూపించినట్టుగానే నా జీవితంలో జరుగుతుందా? ఇలా నేను ఆలోచిస్తూండగా..
"కానీ ఈ ఇంజక్షన్ ట్రూత్ సెరమ్, ఇది తీసుకుని అబద్దం చెప్పలేరు. అంటే ఇతను నిజమే చెబుతూ వుండాలి , లేదా ఇదే నిజమని పూర్తిగా నమ్ముతూ వుండాలి" అన్నాడు.
"ఇందాక ఎక్కడ వున్నాను అన్నారు?" అడిగాను. "వినిపెగ్, కెనడా. ఇక్కడే పట్టుకున్నాం నిన్ను" అన్నాడు. ఆశ్చర్యపోయాను, నేనిక్కడేం చేస్తున్నాను. వీళ్లెవరు, నన్నెందుకు బంధించారు? ఇందాకటినుంచీ గమనించలేదు వీళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు అదికూడా అమెరికన్ యాసలో.. ఆలోచిస్తుండగానే మగత కమ్మేసింది.
Take 2
తలమీద ఎవరో సమ్మెట దెబ్బలు వేస్తున్నట్టు పగిలిపోతున్నంత బాధ, కళ్ళల్లో సూదులతో గుచ్చినట్టు మంట.. హ్యాంగోవరా? కళ్ళు తెరిచినా మసగ్గానే వుంది ఏమీ కనబడడం లేదు. కొంచెం సేపటికి మసక తగ్గి కొద్దిగా కనబడుతుంది, నెమ్మదిగా స్పృహ వస్తుంది. నేనొక కుర్చీలో రెక్కలు వెనక్కి విరిచి కట్టేయబడి వున్నాను.
"గుడ్, స్పృహలోకి వచ్చాడు మళ్ళీ మొదలుపెడదాం" అంటూ వినబడితే తలతిప్పి చూశాను. కొంచెం పొట్టిగా సన్నగా వున్న ఓ వ్యక్తి ముందుకు వంగి నా మొహంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఎవరితను, మళ్ళీ మొదలు పెట్టడం ఏంటి? నా ముందు ఒక టేబుల్ వుంది, దానిమీద కొన్ని ఇంజెక్షన్స్, దూది, ఒక గ్లాసులో కొంచెం నీళ్లు వున్నాయి. ఆ గదిలో టేబుల్ కి కొంచెం దూరంగా ఇద్దరు వస్తాదుల్లా వున్న వ్యక్తులు నిలబడి నన్నే చూస్తున్నారు.
"ఇది ఇందాకటిదానికన్నా పవర్ ఫుల్, రియాక్షన్ వచ్చి బ్రెయిన్ హేమరేజ్ వచ్చే అవకాశాలు కూడా వుంటాయి, కొంచెం జాగ్రత్తగా వుండాలి మనం" అంటూ ఓ ఇంజక్షన్ తెచ్చి నాకు చేయబోయాడు, నేను ప్రతిఘటిద్దామన్నా శరీరం కదలట్లేదు. నిస్సహాయంగా చేయించుకున్నాను. ఏమీ మాట్లాడకుండా అందరూ నన్నే చూస్తున్నారు. ఇందాకటికంటే వొళ్ళు నొప్పులు, కళ్ళ మంటలు తగ్గాయి. ఇంజక్షన్ పని చేస్తుందా, ఇంటరాగేషన్ అయితే మత్తు లేదేంటి, ఇంకోటి చేస్తాడా ఇలా ఆలోచిస్తున్నాను.
"చెప్పు ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు? నీవెనుక ఎవరున్నారు?" మృదువుగా అడిగాడు.
"నా పేరు వరదరాజన్, లఢక్ లో సెటిల్ అయ్యాను" చెప్పడం మొదలుపెట్టాను. మాకో కాఫీ షాప్ వుంది. నా భార్య స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంది. మా పాప 3వ క్లాసు చదువుతుంది. ఒక రోజు మా షాపులోకి ఎవరో కొందరు వ్యక్తులు వచ్చారు, కాఫీ తాగి వెళ్ళిపోతూ షాపుకి వచ్చిన ఒక అమ్మాయిని చూసి వెకిలిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నేను సర్ది చెప్పి పంపుదాం అని ప్రయత్నిస్తుంటే నా మీద దాడి చేశారు. ఆ పెనుగులాటలో వారిలో ఒకతను ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈ లోపులో పోలీసులు వచ్చి మిగిలిన వారిని అరెస్టు చేసి నా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని పంపేశారు.
ఇది జరిగిన కొన్ని రోజులకి కొందరు అనుమానాస్పద వ్యక్తులు మా ఇంటి చుట్టూ, షాపు చుట్టూ కనబడడం మొదలైంది. ఇంట్లో భార్య పిల్లలూ, షాపులో పనిచేసే వారూ భయపడడం నేను పోలీసులని సెక్యూరిటీ కోరడం జరిగింది. ఒకరోజు ఒక పెద్దతను ఇంటికి వచ్చి నేను తన కొడుకునని తన మనవరాలిని (మా పాపని) చూడడానికి వచ్చానని చెప్పాడు. మీరు పొరబడ్డారు, నేను మీ కొడుకుని కాదు అని సర్ది చెప్పి పంపేశాను. అయితే, బయటకి వెళుతూ రేపు తనతో సేలంకి రాకపోతే నా భార్యని కూతురిని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నా భార్య నన్ను నిలదీసింది, నాకు నిజంగా అతనెవరో తెలియదు, పోలీసులకి చెబుదాం అని ఓదార్చాను...
"హిస్టరీ అఫ్ వయోలెన్స్" నా మాటలకి అడ్డొస్తూ అన్నాడు బక్క వ్యక్తి. ప్రశ్నార్ధకంగా చూస్తున్న నాతో "ఇది పాప్యులర్ ఇంగ్లీష్ సినిమా, ఆ కధ చెబుతున్నావు నువ్వు" అన్నాడు అసహనంగా. "ఇంత హై డోస్ ఇంజక్షన్ ఇచ్చాక కూడా సినిమా కథలు ఎలా చెబుతున్నాడు" అడిగాడు అక్కడ నిలబడ్డ ఎద్దు బాబులని. "సార్ అది లియో సినిమా.. " సన్నగా గొణిగాడు ఒక వస్తాదు. ఏంటీ అని గద్దించడంతో, మొన్నొచ్చిన తమిళ సినిమా సార్ అది, ఇంకా పెద్ద హిట్టు అన్నాడు. తమిళ యాస తెలుస్తుంది.
చిన్నగా నవ్విన శబ్దం, రూముకి రెండో వైపు ఆ నవ్వు తాలూకు ఓనర్ చేత్తో నోరు మూసుకుని నవ్వాపుకుంటుంది. "ఈ అమ్మాయి భలే బావుంది" తెలీకుండానే పైకి అనేశాను. కోప్పడతాడేమో అనుకున్న బక్క పలుచని వ్యక్తి నన్ను చూసి తలపట్టుకుని సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నాడు. చాలాసేపు నన్ను పట్టించుకోకుండా వాళ్లలో వాళ్ళే తర్జనభర్జనలు పడసాగారు. నా పరిస్థితి నాకు తెలియడం లేదు, ఎవరు వీళ్ళు, నన్నెందుకు తెచ్చారు, నానుండి ఏం ఆశిస్తున్నారు. ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదు. నేను గమనించింది ఏంటంటే ఏ ఆలోచనా స్థిరంగా వుండడం లేదు. దృష్టి కూడా ఒక చోట నిలపలేకపోతున్నాను.
కాసేపటికి "వెల్, ఆఖరి ప్రయత్నం చేద్దాం. దీనిక్కూడా ఫలితం రాకపోతే మనం నిజంగానే ఓ పిచ్చోడిని పట్టుకున్నాం అని కంఫర్మ్ అయిపోతుంది. చంపేసి పోదాం" అన్నాడు. విచిత్రంగా ఈ మాటలు వేరే ఎవరినో వుద్దేశించి అన్నట్టు నాకేం భయం వేయడం లేదు. పైగా ఆ సంగతి నాకు తెలుస్తుంది. చావంటే భయం పోయిందా? నాకేం అవుతుంది? ఇలా ఆలోచనా సరళి కొనసాగుతూ వుండగానే టక్కున ఇంకో ఇంజక్షన్ చేసేశాడు. ఒక్క సారిగా శరీరంలోని నరాలన్నీ ఉత్తేజితం అయినట్టు ప్రతీ నరంలో రక్తం పారుతున్నట్టు తెలుస్తుంది. మెదడు చురుగ్గా అనిపించసాగింది. పెదవినుంచి రక్తం కారడం తెలుస్తుంది, ఎప్పుడు తగిలింది?
"చెప్పు ఎవరు నువ్వు, ఏం చేస్తూ వుంటావు" అని అడిగాడు.

Take 3
నేనొక గజదొంగను, అసంకల్పితంగా చెప్పడం మొదలుపెట్టాను. నా పేరు రాజు, నేనూ నా మిత్రుడు గంగారాం కలిసి అస్సాం లోని పెద్దమనుషులని దోచుకుని కొంత మా అవసరాలకి వుంచుకుని మిగిలింది పేదలకి పంచి పెడుతూ వుంటాం అన్నాను.
"సరే ఇక్కడేం చేస్తున్నావు" అన్నాడు అనుమానంగా చూస్తూ. "ఒక అంతర్జాతీయ ముఠా వజ్రాలు స్మగ్గ్లింగ్ చేస్తున్నారని సమాచారం తెలిసింది. వారిని దోచుకోవడానికి సిల్చర్ నుంచి ముంబయి సిటీ వచ్చాము, ఇంతలో మీరు పట్టుకున్నారు. గంగారాం ఎక్కడున్నాడు" అనడిగాను.
"రేయ్, నువ్వున్నది ముంబైలో కాదు కెనడాలో. ఇక్కడేం చేస్తున్నావు అంటే ఏవో కధలు చెబుతున్నావు" కోపం పట్టలేక చెంపమీద ఒక్కటిచ్చాడు. పెదవి మీద ఎండిన గాయం మళ్ళీ చిట్లి రక్తం కారసాగింది. "కెనడాలో ఏం చేస్తున్నాను, నన్నెవరు తీసుకొచ్చారు" ఆలోచిస్తూ పైకే అన్నాను.
ఇంతలో గది బయట చిన్నగా ప్రేలుడు శబ్దం వినబడింది, బాంబు అనుకుంటా. ఆ వెనుకే తుపాకుల మోత. ఈసారి పేలుడుకి గదికున్న తలుపు వూడి పడిపోయింది, ప్లెయిన్ క్లోత్స్ లో వున్న కొందరు ఒక్కసారిగా విరుచుకు పడి ఆ గదిలో వున్న వారిని బందించేశారు..
నాకు నెమ్మదిగా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బతికే వున్నాడా అని అని ఎవరో అడగడం వినిపిస్తుండగా స్పృహ కోల్పోయాను.

Recovery
చలిపెడుతుంటే మెలకువ వచ్చింది. ఒక కన్ను తెరుచుకోవడం లేదు, రెండో కన్ను తెరిచి చూస్తే ఏసీ రూములో మెత్తని బెడ్ మీద వున్నాను, ఫైవ్ స్టార్ హాస్పిటల్లా వుంది. ఒళ్ళంతా బ్యాండేజి వేసేశారు. రూములో మానిటర్లు, సోఫా, టీపాయ్, గోడ మీద టీవీ, పక్కన సెలైన్ స్టాండ్ తప్ప మనుషులెవరూ లేరు. టీవీలో అశోక్ సరాఫ్ పాట వస్తుంది. పాత మరాఠీ సినిమా అనుకుంటా.
స్వింగ్ డోర్ ఓపెన్ చేసుకుంటూ నర్స్ వచ్చింది, మెలకువగా వున్న నన్ను చూస్తూ ఎలావుందీ అని అడిగింది. నా సమాధానం కోసం చూడకుండా చేయి పట్టుకుని పల్స్ చెక్ చేసి, స్టాండ్ మీద వున్న ఇంజక్షన్ తీసి చేసేసింది. డాక్టర్ రౌండ్స్ లో వున్నారు, ఓ పదినిమిషాల్లో వచ్చి చూస్తారు అని చెప్పి వెళ్ళిపోయింది.
చాలా సేపటికి డాక్టర్ వచ్చారు, వెనుకే ఓ అమ్మాయి వచ్చింది. "ఈ అమ్మాయి భలే బావుంది" పైకే అనేశాను. డాక్టరు గట్టిగా నవ్వి కేసు షీట్ చూస్తూ "యు అర్ ఇన్ ఏ బెటర్ కండిషన్ నౌ" అని ఆ అమ్మాయిని నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ఇంతసేపూ కళ్ళనిండా నీళ్లతో నన్నే చూస్తూ నిలబడ్డ ఆ అమ్మాయి డాక్టర్ వెళ్ళిపోగానే ఒక్క ఉదుటున దగ్గరికి వచ్చి నన్ను చుట్టేసింది.
"అమ్మా" ప్రక్కటెముకలు కళుక్కుమన్నాయి.
"అయ్యయ్యో, సారీ సారీ నొప్పిగా వుందా" అని అడుగుతూ కొంచెం దూరం జరిగింది కానీ నన్ను వదలలేదు. మౌనంగా కన్నీళ్లు కారుస్తూ అలానే వుండిపోయింది. చిన్నగా వెక్కి పడుతుంది.
నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు. వాళ్లందరిలో పెద్దాయన "రిపోర్ట్స్ వచ్చాయి. ఎడమ చేయి, ప్రక్కటెముకలు, ముక్కుదూలం ఫ్రాక్చర్ అయ్యాయి. రెండు మూడు నెలల్లో మామూలు అవుతాడు. ఓ మూడు నాలుగు రోజుల్లో జ్ఞాపకం కూడా వచ్చేస్తుంది. ఇంక భయపడాల్సింది ఏమీ లేదమ్మా..సాయంత్రానికి షిఫ్ట్ చేసేస్తారంట" ఆ అమ్మాయితో అన్నారు.
"ఇతని మెమొరీ ఎందుకు పోయింది, వాళ్ళు పెట్టిన చిత్రహింసలకా?" బ్యూరోక్రాట్ లాగా కనబడుతున్నతని ఎంక్వయిరీ.
"ఇది హై ఎండ్ టెక్నాలజీ సర్, అడ్వాన్సుడ్ నానో టెక్నాలజీ కపుల్డ్ విత్ జెనెరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్[2], నానో టెక్నాలజీని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో కలిపి తయారు చేశారు" రావు రమేష్ (పెద్దాయన) గారి సమాధానం. "ఫీల్డ్ వర్క్ లో వుండగా మన ఏజెంట్స్ దొరికిపోతే వారినుంచి రహస్యాలు రాబట్టడం కోసం టార్చర్ చేయడం సహజం. ఈ టార్చర్ ఒక లెవల్ దాటాక వాళ్లకి జ్ఞాపకశక్తి తాత్కాలికంగా పోయి కృత్రిమ మేధ (Artificial Intelligence / AI) యాక్టివేట్ అవుతుంది. ఇక్కడనుంచీ AI ఆ ఏజెంట్ ని నడిపిస్తుంది. అంటే, వాళ్ళ ఇంటర్రాగేషన్ కి ప్రతిస్పందించేది AI మాత్రమే"
"ఇంటరెస్టింగ్, ఇది ఏ దేశపు టెక్నాలజీ?" బ్యూరోక్రాట్ బాబు సందేహం.
"పూర్తిగా మేక్ ఇన్ ఇండియా సర్, డీ.ఆర్.డీ.ఓ., ముంబయి ఐఐటీ వాళ్ళు కలిసి డెవలప్ చేసిన టెక్నాలజీ ఇది. ప్రపంచంలో వేరెవరికీ లేదు. వున్నా ఇంత అడ్వాంస్డ్ వుండదు"
"AIని ఒక మనిషిలో ఎలా పెట్టారు? చిప్ ఇంప్లాంట్ చేశారా? పట్టుకున్న వాళ్ళు స్కాన్ చేస్తే తెలిసిపోతుందిగా?" సర్కారీ బాబు డౌట్.
"ఇందాక నానో టెక్నాలజీ అన్నాను విన్నారా?" రావు రమేష్ గారు చెప్పసాగారు. "మామూలు కంటికి కనబడని నానో బాట్స్[1] AI ని రన్ చేస్తాయి. వాటిని ఏజెంట్స్ బాడీలో ఇంజెక్ట్ చేస్తాం. ఏ స్కానింగ్ కీ దొరకవు."
"నానో బాట్స్ అంటే..?"
"మామూలు కంటికి కనబడని అతి సూక్ష్మమైన రోబోట్లు. సాధారణ రక్తకణం కంటే పది రెట్లు చిన్నగా వుంటాయి. ఇప్పుడిప్పుడే మెడికల్ ఫీల్డ్ లో వాడుతున్నారు. ఇవి మనిషి శరీరంలోని కాన్సర్ సెల్స్ ని ముందుగా కనిపెట్టి సమాచారం ఇవ్వడం, ఆ సెల్స్ ని నిర్వీర్యం చేయడం లాంటివి చేస్తాయి. మన శాస్త్రజ్ఞులు వీటిని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో అనుసంధానం చేసి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మన డిఫెన్స్ విభాగాలకు మాత్రమే ఈ టెక్నాలజీని పరిమితం చేశారు. ఇది బాగా ఖర్చుతో కూడినది. ప్రస్తుతం డిఫెన్స్ లైన్ లో బాగా టాప్ ఏజెన్సీలు, అందులోనూ ముఖ్యమైన ఏజెంట్లకు మాత్రమే వాడుతున్నాం. అదీ ట్రయల్ బేసిస్ మీద" రావుగారు ఓపిగ్గా వివరించారు.
"అద్భుతం సర్, దాని కంట్రోల్ మీదగ్గరే వుంటుందా?" సర్కారీ బాబు (బ్యూరోక్రాట్) సినిమాల్లో చూపించినట్టు కాదు, చాలా తెలివిగా వున్నాడు.
"లేదు సర్, బయటనుంచి కంట్రోల్ ఏమీ వుండదు. అతని శరీరంలో వేరేగా వుండే ట్రాకింగ్ వ్యవస్థ వల్ల ఎక్కడున్నాడో కనిపెట్టి రక్షించుకుంటాం. వీళ్ళు మళ్ళీ బేస్ కి వచ్చినప్పుడు ఆ సిస్టంకి కనెక్ట్ అయ్యి ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. ఇందాక మనం చూసినట్టు". బాబు ఈ వివరణతో సంతృప్తి చెందినట్టున్నాడు, ఇంకేం ప్రశ్నలు వేయలేదు.
"రచనా, జాగ్రత్తగా చూసుకో . డిశ్చార్జ్ చేసే సమయానికి నేను మళ్ళీ వస్తాను. బీ అలర్ట్ బాయ్స్" అందరికీ ఆదేశాలు ఇచ్చేసి పదండి సర్ అంటూ బ్యూరోక్రాట్ గారిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు.
అంతా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నట్టున్నారు. కాసేపటికి.. "ఇందాకటినుంచీ ఒకటి కొట్టేస్తుంది అడగనా?" వీళ్ళలో కుర్రాడిలా వున్న ఓ చిక్నా ఏజెంటు, ఏంటీ అన్నట్టుగా మొహం పెట్టిన మిగిలిన వారి వైపు చూస్తూ.. "మొదటిది 'ట్రూ లైస్', రెండోది 'లియో' లేదా ఆ ఇంగ్లీష్ మూవీ.. మరి ఆ మూడోది ఏమిటి? ఈ రాజు, గంగారాంలు ఎవరు? అసలు ఆ అస్సాం స్టోరీ ఎందుకు చెబుతున్నాడు?"
"నాక్కుడా తెలీదు, భాస్కర్ భయ్యాకే తెలియాలి" తల అడ్డంగా ఊపుతూ అంది రచన.
సదరు భాస్కర్ చిన్నగా నవ్వుతూ "షాడో" అన్నాడు. "ఒకప్పుడు తెలుగులో పాకెట్ సైజు డిటెక్టివ్ బుక్స్ వచ్చేవి వాటిలో మధుబాబు అనే ప్రముఖ రచయిత రాసిన షాడో నవలలు బాగా ఫేమస్. వాటిలో పాత్రలే ఈ రాజు అనబడే షాడో, అతని మిత్రుడు గంగారాం " చెప్పాడు.
ఇందాకటినుంచీ నేను ఒకడిని అక్కడ వున్నానని గ్రహించనట్టుగా వీళ్ళందరూ మాట్లాడిన దాని సారాంశం నేనొక సీక్రెట్ ఆర్గనైజషన్ ఏజెంటుని, ఎదో ఆపరేషన్లో వుండగా పట్టుబడ్డాను. నన్ను ఇంటర్రాగేట్ చేస్తుండగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నా జ్ఞాపక శక్తిని టేక్ ఓవర్ చేసింది. బహుశా కొన్ని రోజుల్లో నా జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది. ఈ అందమైన అమ్మాయి రచనకి నేను కావల్సిన వాడిని. బాయ్ ఫ్రెండ్ లేదా భర్త అయ్యుండొచ్చు. "నువ్వెంత లక్కీనో నీకర్ధం కావడం లేదురా అబ్బాయ్", అనుకోకుండానే పైకి అనేశాను. మగాళ్ళిద్దరూ పెద్దగా నవ్వుతూ నావైపు చూశారు. రచన నవ్వు దాచుకుని సిగ్గుపడుతూ మొహం అటువేపుకి తిప్పుకుంది.
ముగ్గురూ బాగా పరిచయస్తులనుకుంటా.. వాళ్లిద్దరూ రచనని టీజ్ చేయడం మొదలెట్టారు. రచన వాళ్ళని బెదిరిస్తోంది. నాకేమీ జ్ఞాపకం లేదన్న విషయం గ్రహించబట్టేమో వాళ్ళెవరూ నాతో డైరెక్టుగా ఏమీ మాట్లాడడం లేదు. కాసేపటికి నేను నిద్రలోకి జారుకున్నాను.

అసలు కథ
రెణ్ణెల్ల క్రితం, ఓ సాయంత్రం 7:00 గంటలకు:
మీటింగ్ రూమ్, యూనియన్ హోమ్ మినిస్టర్ శ్రీ హర్ జోత్ సింగ్ మాన్ గారి ఆఫీస్, నార్త్ బ్లాక్, సెక్రెటేరియట్, న్యూఢిల్లీ లో ఒక సమావేశం. పెద్ద హాలు, ప్రొజెక్టర్ స్క్రీన్ పైకి రోల్ చేయబడి వుంది. దాని వెనుకగా 10' x 8' సైజులో మాజీ ప్రధాని కీ| శే| శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయీ గారి (కూర్చుని తన డెస్క్ మీద ఏదో కవిత వ్రాస్తున్న చిత్రం) ఆయిల్ పెంటింగ్ చిత్రీకరించబడి వుంది. దానికి కొంచెం దూరంలో ఎదురుగా పెద్ద టేబుల్ కనీసం 16 నుంచి 20 మంది కూర్చునే విధంగా ఛెయిర్స్ వున్నాయి. గృహమంత్రివర్యులు అటల్జీకి వీరాభిమాని, మరియు ప్రియశిష్యుడు.
హోమ్, రక్షణ, మరియు విదేశాంగ శాఖామాత్యులు, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ చీఫ్ డైరెక్టర్, ఫీల్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్, చీఫ్ అనలిస్ట్, రక్షణ మంత్రి ముఖ్య సలహాదారు, నేషనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (NIA) చీఫ్, మరో ఇద్దరు అతి ముఖ్యమైన ఆఫీసర్స్ మాత్రమే ఈ మీటింగ్ హాజరవుతున్న పెద్దలు. అత్యంత రహస్య సమావేశం ఇది, పాల్గొన్న వారికీ మరికొద్ది మంది అవసరమైన వారికీ తప్ప సమావేశం గురించి ఎవరికీ తెలియదు.
"గురుబక్ష్ సింగ్ సంధు, ఖలిస్తానీ లీడర్ & కెనడా ఆపరేషన్స్ హెడ్ మరియు యూనిస్ మొహమ్మద్ ఖాన్, ఐఎస్ఐ (ఇండియా ఆపరేషన్స్) డైరెక్టర్ కలిసి మొత్తం ప్లాన్ చేశారు సర్" వివరించడం మొదలుపెట్టారు RAW ఫీల్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్ విరుద్ధ్ సక్సేనా. కెనడాలోని భారత ప్రధాన రాయబారిని, మరికొందరు డిప్లొమాట్స్ ని హతమార్చడం, దానికి ప్రతీకారంగా దాడులు జరిగినట్టుగా మన దేశంలోని స్వర్ణ దేవాలయం మీద ఎటాక్ చేయడం అనేది ప్లాన్. ఈ ఎటాక్ చేసింది RSS మరియు హిందూ వాదులు అని తమ టూల్ కిట్ ద్వారా గ్లోబల్ గా ప్రచారం చేయడం నెక్స్ట్ స్టెప్. దీనికి కావాల్సిన లాజిస్టిక్స్ అన్నీ పాకిస్తాన్ ఎంబసీ సమకూరుస్తుంది, పూర్తి ఆపరేషన్ కు ఇరాన్ ఆర్ధిక సాయం చేయబోతుందని పక్కా ఆధారాలు వున్నాయి సర్.
ఈ ఆధారాలని బయటపెట్టి వారిని నిలువరించగలమా అని గృహ మంత్రి అడిగారు. "లేదు సర్, స్థానిక ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకోసం వారిని వెనకేసుకు వస్తుందని మనకి తెలిసిందే బయటపెట్టి మనం చేయగలిగేది ఏమీ వుండదు" రక్షణ మంత్రి వాస్తవ పరిస్థితిని చెప్పారు. డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎలా వుంటుంది అన్న ప్రశ్నకి విదేశాంగ మంత్రి బదులిస్తూ "ముందు ఇంట్లోనే వ్యతిరేకత మొదలవుతుంది సర్. బాలాకోట్ దాడి అంతా బూటకం అని గొడవ చేసింది మన ప్రతిపక్షాలే. తమ పార్లమెంటులో స్వయంగా పాకిస్తాన్ ధృవీకరించే వరకు వీళ్ళు ప్రభుత్వం మీద దాడి చేస్తూనే వున్నారు". డైరెక్ట్ యాక్షన్ వీలు కాదు అని తేల్చేశారు. "రా చీఫ్, నేను మొత్తం ప్లాన్ ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాం సర్, ఫూల్ ప్రూఫ్ గా వుంది. విజయవంతంగా పూర్తి చేస్తామన్న నమ్మకం 100% వుంది" అంటూ ఎన్ఐఏ చీఫ్ తన సమ్మతిని తెలియజేసారు.
"పరిస్థితి చేజారిపోకుండా హ్యాండిల్ చేయండి" నర్మగర్భంగా చెబుతూ ఎవరు లీడ్ చేస్తున్నారు అని కుతూహలంగా అడిగారు గృహ మంత్రి. "సీనియర్ అనలిస్ట్ ప్రమోద్ యాదవ్ లీడ్ చేస్తున్నాడు సర్. ఇప్పటికే ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తిచేసిన క్రెడిట్ అతనికి వుంది" సక్సేనా గారు చెప్పారు. మంత్రిగారు లేస్తూ ఆల్ ది బెస్ట్ యంగ్ మాన్, టేక్ కేర్ అఫ్ దిస్ అంటూ ప్రమోద్ తో కరచాలనం చేసి ఛాంబర్ బయటకి వెళ్లిపోయారు.

రెండు వారాల క్రితం:
విన్నీపెగ్, కెనడాలో చల్లటి శీతాకాల సాయంత్రం, ఉష్ణోగ్రత గణనీయంగా మైనస్ లలోకి తగ్గింది. సమీపంలోని ప్రాంతాన్ని మంచు కప్పి, వీధి దీపాల కాంతిలో మెరుస్తూంది. ఆ వీధి చివరలో మిగిలిన ఇళ్ళకి కొంచెం దూరంగా ఓ రెండు అంతస్తుల భవంతి ఉంది. మొదటి అంతస్థు లివింగ్ రూమ్ ఫైర్ ప్లేస్ లో మంటలు చిటపటమంటూ వెలునీ వేడినీ యిస్తున్నాయి. పెద్ద కిటికీల నుంచి వెలుపలి మంచుతో కప్పిన వీధి కనిపిస్తోంది, గోడలపై ఎవరివో ఫామిలీ ఫోటోలు, సర్టిఫికేట్లు, మరియు కొన్ని ఫ్రేమ్ చేసిన అందమైన పెయింటింగ్స్ అలంకరించబడి ఉన్నాయి. లివింగ్ రూమ్ నుండి కనిపించే వంటగదిలో పొయ్యిపైన స్వీట్ పొటాటో సూపు మరుగుతోంది, దాని వాసన అప్పుడే కాల్చిన బ్రెడ్‌తో కలిసి గదినిండా వ్యాపించింది. లివింగ్ రూమ్ మధ్యలో వున్న పెద్ద టేబుల్ పైన ఒక మ్యాప్ ని పరిచి నలుగురు వ్యక్తులు మంద్ర స్వరంలో చర్చించుకుంటున్నారు.
ఆ బిల్డింగ్ కు కొద్దీ దూరంలో పవర్ఫుల్ నైట్ విజన్ బైనాక్యూలర్స్ తో ఈ రెండవూ పాయింట్(సమావేశ స్థలం)ని గమనిస్తున్న ప్రమోద్ "బాయ్స్ మనకున్న సమాచారం ప్రకారం కొద్ది సేపటిలో సంధు తన మనుషులతో వచ్చి వీరికి కావాల్సిన ఆయుధాలు, డబ్బు ఇచ్చి, మాట్లాడి వెళ్ళిపోతాడు. మొత్తం ఓ ఐదు నిమిషాల్లో జరిగిపోవచ్చు. ఈ సమయంలోనే మనం పని కానిచ్చేయాలి" అన్నాడు. ఎస్ సర్ అంటూ మిగిలిన ముగ్గురూ లేచారు. అందరూ కామాఫ్లాజ్ లో వున్నారు, దూరం నుంచి చూస్తే మంచు తప్ప మనుషులు కనబడరు. ప్రతీ ఒక్కరి చేతిలో సెమి ఆటోమాటిక్ వెపన్, సైలెన్సర్ అమర్చిన హ్యాండ్ గన్, ఇంకా వాటికి అదనపు కాట్రిడ్జెస్ వున్నాయి. నలుగురూ నిశ్శబ్దంగా ఆ భవంతిని చేరుకున్నారు. చప్పుడు కాకుండా బిల్డింగ్ లోకి ప్రవేశించిన బృందం మేడ మీదికి చేరుకొని నాలుగు ప్రక్కలా బైనాక్యూలర్స్ లో గమనించడం ప్రారంభించారు.
నిర్మానుష్యంగా వున్న ఆ వీధి చివరనుంచి ఒక హోండా ఒడిస్సీ మినీ వ్యాన్ లోనికొచ్చింది. హెడ్ లైట్స్ అఫ్ చేసి వున్నాయి. నిశ్శబ్దంగా వచ్చి బిల్డింగ్ కి పది మీటర్ల దూరంలో ఆగింది. ఇద్దరు వ్యక్తులు దిగి వెనుక డోర్ నుంచి పెద్ద పెట్టెని క్రిందకి దించి బిల్డింగ్ లోకి మోసుకు పోతున్నారు. వారిని అనుసరిస్తూ మరొక వ్యక్తి వెళ్ళాడు. వాళ్ళొచ్చేలోపు ప్రమోద్ బృందం వేగంగా మొదటి అంతస్తుకి దిగి అక్కడున్న నలుగురినీ కాల్చేశారు. ఈ పెట్టె పట్టుకొస్తున్న ఇద్దరినీ పైకి రానిచ్చి వారినీ కాల్చి చంపేశారు. వాళ్ళు క్రింద పడేలోపు ప్రమోద్ వారిని అనుసరిస్తున్న మూడో వ్యక్తిని గురిపెట్టి షూట్ చేశాడు. చనిపోయిన ముగ్గురి దేహాలు పరిశీలనగా చూశాడు ప్రమోద్. వారిలో సంధు లేడు. అయితే వ్యాన్ లోనే వుండిపోయి వుండాలి లేదా అసలు రాకపోయుండాలి.
అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్న ప్రమోద్ "బాయ్స్ మీరు బయల్దేరండి, సంధు వ్యాన్లో వుంటే నేను వాడిని న్యూట్రలైజ్ చేసి వచ్చేస్తాను" తన నిర్ణయం తెలిపి ఒక్క హ్యాండ్ గన్ తప్ప మిగిలిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలు వారికిచ్చేశాడు.. ఇలాంటి ఆపరేషన్స్ లో చర్చలు వాదులాటలూ వుండవు. మాన్ ఇన్ కమాండ్ ఏం చెబితే అది చేయడమే. సినిమాల్లోలాగా నో సార్ నేను త్యాగం చేస్తాను మీరు వెళ్ళండి అని సవాలు చేయడం జరగదు. ఎస్ సర్, అంటూ వారు సంధు మనుషులు తెచ్చిన పెట్టెని పట్టుకుని బిల్డింగ్ వెనుక వైపునుంచి బయటకు పరుగు తీశారు.. ప్రమోద్ ఆ భవంతి ముందుకి వచ్చి వ్యాన్ వైపు కదిలాడు. నెమ్మదిగా వ్యాన్ని సమీపించి డోర్ ఓపెన్ చేసి చూస్తే.. సంధు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనబడ్డాడు. వేరే ఆలోచన లేకుండా వాడిని పాయింట్ బ్లాంక్ లో కాల్చేశాడు.
ఇంకా ఎవరున్నారో వెదకాలని తిరిగేలోపు వెనుకనుండి ఆటోమేటిక్ రైఫిల్ బట్ తో నెత్తి మీద బలంగా దెబ్బపడింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. మొత్తం ఆరుగురు వచ్చారు, ముగ్గురు పెట్టెతో బిల్డింగ్ లోకి వెళ్లగా సంధుతో బాటు ఇంకో ఇద్దరు వ్యాన్ లోనే వున్నారు. సంధు ముఖ్యమైన ఫోన్ మాట్లాడుతున్నాడని మిగిలిన ఇద్దరూ వ్యాన్ బయట రెండో పక్క నిలబడి వున్నారు. కాల్చిన శబ్దం వినబడి ప్రమోద్ మీద దాడి చేశారు.
ఆ ఇద్దరు వ్యక్తులు ప్రమోద్ ని వాన్ లో తమతో బాటు తీసుకు పోయారు, దీన్ని గమనించిన ప్రమోద్ బృందం, నడి రోడ్లో వారిమీద అటాక్ చేస్తే చుట్టుపక్కల వారి దృష్టిని ఆకర్షించే ప్రమాదం వుందని గ్రహించి బ్యాక్ అప్ కోసం సమాచారం అందించి,వారిని ఫాలో అవసాగారు. రెండు గంటల తర్వాత ప్రమోద్ ని బంధించిన ప్రదేశానికి కొద్ధి దూరంలో బ్యాక్ అప్ టీం వీరిని కలిసింది. అందరూ కలిసి దాడి చేసి ప్రమోద్ ని రక్షించారు. తనని విచారణ చేసే సమయంలో ప్రమోద్ అమెరికన్ సీఐఏ (CIA) కూడా వీరి వెనుక వున్న విషయాన్ని గమనించాడు. మిగిలిన సందర్భాల్లోలాగానే దీనిని కూడా నిలబెట్టి ప్రశ్నించే అవకాశం లేదు.

ప్రస్తుతానికి వస్తే:
"వాళ్ళని చంపేసి ఆయుధాల బాక్స్ ని చేజిక్కుంచుకోగానే వచ్చేస్తే పట్టుబడేవాడు కాదుగా ?" రచన అనుమానం. "మిషన్ వుద్దేశం ఆయుధాలు పట్టుకోవడం కాదు, గురుబక్ష్ సింగ్ సంధుని న్యూట్రలైజ్ చేయడం" మోహన్ గోఖలే గారు సమాధానం చెప్పారు (నేను ముందు పరిచయం చేసిన రావు రమేష్ ఈయనే). ఎస్, నాకు జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది. ఫ్రాక్చర్స్ తగ్గడానికి నాలుగు వారాలు పడుతుందని డాక్టర్ గారు చెప్పారు.
డిఫెన్స్ మినిస్టర్ లైన్లో వున్నారు అంటూ గోఖలేగారు ఫోన్ నాకు ఇచ్చారు. గుడ్ మార్నింగ్ సర్ అన్నాను. "ఆపరేషన్ విజయవంతంగా పూర్తిచేసినందుకు కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ ప్రమోద్, ఎలా వున్నారు? మీరు మనందరికీ గర్వ కారణం అని హోమ్ మినిష్టర్ గారు తమ శుభాకాంక్షలు తెలియజేయమన్నారు. త్వరగా కోలుకుని మీరు పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను" అని రక్షణ మంత్రిగారు పెట్టేశారు.
"నాకు రేపు కూడా లీవ్ కావాలి నాన్నా, ఎల్లుండి రిపోర్ట్ చేస్తాను" అని మోహన్ గారిని అడిగింది రచన. ఆమె గోఖలేగారి ముద్దుల కూతురు రచన గోఖలే, నా ఒక్కగానొక్క భార్యామణి. తను రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ లో డేటా అనలిస్ట్. తనది డెస్క్ జాబ్, నాది ఫీల్డ్ జాబ్. మామూలుగా ఆఫీస్ రొమాన్స్ ఒప్పుకోరు కానీ మాది స్పెషల్ కేస్. తనది ఆల్మోస్ట్ 9 టూ 5 జాబ్. పూర్తిగా టెక్నికల్ వర్క్ మాత్రమే వుంటుంది. ఎస్పియొనేజ్ (గూఢచర్యం), ఫీల్డ్ ఆపరేషన్స్ వంటి వాటికి ఏమాత్రం సంబంధం వుండదు. ఏమైనా వుంటే ఇందాక బాక్స్ దొరగ్గానే వచ్చేస్తే లాంటి ప్రశ్నలు వేయదు.

ఈ అమ్మాయి భలే బావుంది:
రెండు రోజుల తర్వాత ఓ సాయంత్రం.. "ఇంటరాగేషన్ రికార్డింగ్స్ తో సహా మొత్తం బ్రీఫింగ్ విన్నాం.. అంత బాధలోనూ ఈ అమ్మాయి భలే బావుంది అని నాలుగు సార్లు అన్నావ్, మగబుద్ది..", రచన మేడం ఫిర్యాదు. నేను చిన్నగా నవ్వుతూ "నాలుగు కాదు మూడు సార్లే.." అన్నాను. సాలోచనగా నన్ను చూస్తూ మరోసారి నెమరు వేసుకుని "నిజమే మొదటి సారి 'ట్రూ లైస్' కథ తర్వాత, రెండో సారి 'లియో' చెప్పాక, మూడో సారి నన్ను చూశాక (కొంచెం గర్వం వినబడింది) కదా?" అడిగింది. తలూపాను.
ఏదో స్ఫురించినట్టుంది, "అవునూ మేము ఆ రికార్డింగ్స్ విన్నప్పుడు నువ్వు లేవు, నాకు తెలిసి నువ్వు ఇంకా వినలేదు, ఏం మాట్లాడావో నీకెలా తెలిసింది?" అనుమానంగా అడిగింది. అది ట్రేడ్ సీక్రెట్ చిట్టీ చెప్పకూడదు అన్నా.. 'హ్మ్మ్' బుంగమూతి పెట్టుకుని లేచిపోయింది.
నిజం చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది. "రచనా ఇలా కూర్చో నీకో విషయం చెప్పాలి" అన్నాను. "ఏంటది చెప్పూ.." గారంగా అంటూ వచ్చి వళ్ళో కూర్చుంది. మీకు చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో బాట్స్ కథలో ఒక చిన్న ట్విస్టు వుంది. వాళ్ళు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎవరినీ పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకోలేదు, ఆ అవకాశం యివ్వరు. కేవలం సూచనలు మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా వాడుకోవాలో ఆ ఏజెంటు ఇష్టం. అంటే.ఆ కథలు ఏఐ నాకు చెబితే వాటిని సమయానికి అనుకూలంగా నేను వాళ్లకి చెప్పాను.
మరి జ్ఞాపక శక్తి పోవడం..? సందేహంగా అడిగింది. "అదైతే కొంత నిజమే పూర్వం జరిగిన విషయాలు తాత్కాలికంగా మర్చిపోతాం. కానీ అపాయంలో వున్నాం తప్పించుకోవాలి అనేది మాత్రం తెలుస్తూ వుంటుంది" అన్నాను. మరి నాన్న ఎందుకు ఆలా చెప్పారు? ఇంకా సందేహం పోలేదు. వాళ్ళ నాన్నకి తెలీకుండా ఉండదు అనే నమ్మకం.
మీ నాన్న లాజిస్టిక్స్ డైరెక్టర్, ఆయనకి ఫీల్డ్ ఆపరేషన్స్ తో ప్రత్యక్ష సంబంధం వుండదు. పైగా ఈ విషయం తెలిస్తే ఆపరేషన్ విజయావకాశాల మీద పూర్తి నమ్మకంతో వుండలేరు, అందుకే ఫీల్డ్ ఎగ్జిక్యూషన్ తప్ప మిగిలిన డిపార్ట్మెంట్స్ వాళ్లకి అలాగే చెబుతారు. మీ నాన్నకి అస్సలు చెప్పరు, కూతురి జీవితం ఏమైపోతుందో అని బెంగ పెట్టుకుంటారు. "అయితే ఇప్పుడు నాకెందుకు చెప్పావు?" కొంచెం కోపంగా చూస్తూ సీరియస్ గా అడిగింది.
"మంచి ప్రశ్న, నీ దగ్గర ఏమైనా దాచానా బేబీ?" ఇంకా కోపంగానే వుంది. "సరే విను, పూర్తిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అధీనం లోకి పోయి తిరిగి రాకపోతే వాళ్ళ జీవితాలు ఏమవ్వాలి" అని ఈ కేసుని దగ్గరగా పరిశీలిస్తున్న హోమ్ శాఖ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేయడం వల్ల వారి మనోభావాలు లెక్కలోకి తీసుకుని అసలు విషయాన్ని సమీప బంధువులకి అంటే కేవలం తమ భార్య/భర్త/పార్టనర్ పెళ్లికాని వారుంటే తల్లి/తండ్రి లకు మాత్రమే చెప్పమని డైరెక్షన్స్ వచ్చాయి. ఈ విషయం మీ నాన్నకి చెప్పకు."
నాక్ నాక్ .. "ప్రమోద్ మై బాయ్" అంటూ తలుపు కొట్టారు గోఖలే గారు. గబుక్కున ఒళ్ళోంచి లేచి వెళ్లి తలుపు తీసింది ఆయన కూతురు, విని వుంటారా, ఆ గుంభనమైన నవ్వు చూస్తుంటే వినేసినట్టే వుంది. చెప్పండి సర్ అన్నాను..
"ఈ నాలుగు వారాల్లో కొరియన్ భాష నేర్చుకోవాలోయ్, నెక్స్ట్ ఆసైన్ మెంట్ కొరియాలో.. "
సమాప్తం.

Comments
Post a Comment