విధి (fate)

హరిశ్చంద్ర నాటకంలో
ఓ పద్యం ఏమి చెబుతుందంటే

అన్నదమ్ములును
తల్లిదండ్రులును 
స్నేహితులు
బంధువులు 
వెంటరారు 
తుదిన్

సంపదలు
ఆస్తులు
ఏవియు నీకు
తోడుగా
నీడగా 
రావు 

ఇది అంతయు విధి
ఆడు నాటకం 

విధి ఎవడితో 
ఎప్పుడు ఎలా 
ఆడుకుంటుందో తెలియదు
విధి నెవడు తప్పించలేడు.

ధనం, స్థానం
వున్న వాడినని
గర్వం వలదు

నిన్నటి కింకరుడు
నేడు రాజగును 
నేటి రాజు
రేపు కింకరుడగును  

ఇది పద్యం యొక్క భావం

------*****------- 

గత ఆరునెలల్లో     
జరిగిన ఎన్నికల 
ఫలితాలు చూస్తే 
 
విధి, కొందరి జీవితాలతో   
ఎలా ఆడుకొందో, 
ఆ కథలు మనం    
విన్నాం, కన్నాం      
  
తిరుగు లేక, నిశిలో 
వెలిగి పోతామనుకొన్న  
శశి శేఖరులు 
మసక బారిపోయిరి. 

దొరసానులుగా  
తిరిగినవారు
చెరసాలను 
అలరించిరి  

సమస్యలు తీరగా 
అమావాస్య చంద్రులకు
పౌర్ణమి దినంలు వచ్చే   
 
అనుకూల పవనాలు వీచగా
కొందరు పవనులు
కూటమికి వారధిగా
భవిషత్తుకు సారధిగా
ఎదిగిరి   
  
నమ్ముకొన్న సంక్షేమములు 
వమ్ముకాగ కొందరికి  
క్షామము, క్షమం మిగిలే                
  
ఈ జగమంతా నాజనం  
ఈ యుగమంతా నా ప్రభంజనం
వాడితో పొత్తు ఏమిటి 
వీడితో దోస్తి ఏమిటి  
యని ఊహాల్లో 
అపోహల్లో బ్రతికిన నేతలు
ఓటమి తప్పించుకొనుటకొరకు 
నేడు కూటమి పేరుతో 
చేతులు కలిపిరి 

అంతయు విధి మహిమ
 
కావున..
పదవి, సంపదలు వున్నప్పుడు
మాటలు పొదుపుగాను 
ఆవేశం అదుపుగాను 
పనులు ధర్మంగాను 
నిర్వర్తించిన 
ప్రవర్థించిన 
విధి మనతో 
కబాడి ఆడుకొనదు 

లేదా సంపదలెంత 
వున్నా
ఆపదలు తప్పవు

డబ్బులెంత వున్నా
జబ్బులను ఆపవు 

     (సరదాగా మీ)
           కృష్ణా అక్కులు

Comments