పవర్ స్టార్ అభిమాని vs పార్టీ కార్యకర్త

మూవీ ఫ్యాన్స్ & పవన్ కళ్యాణ్ పార్టీ సానుభూతి పరులూ, మీకు అభిమానం వుంది, గెలిస్తే బావుంటుంది అనే కోరిక వుంది. We respect that.👍

పార్టీ కార్యకర్త దానిని దాటి పార్టీ సభ్యత్వం తీసుకుంటాడు. తన పార్టీ కోసం తన పరిధి మేరకు  చేతనైంది చేయాలనుకుంటాడు. పార్టీ సభ్యుడుగా సపోర్టు చేయడం తప్ప క్వశ్చన్ చేయడం తన పని కాదు. నాయకుడి నిబద్దత మీద, పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకం వున్నంతవరకూ పార్టీలోనే వుంటాడు.

అలాంటి కార్యకర్తల మీద నమ్మకంతోనే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు నాయకులు. సిద్ధాంతాలు, పద్దతులు వేరైనా BRS క్యాడర్ ఈ విషయంలో నచ్చుతారు. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం ఒక సందర్భంలో ఎలక్షన్స్ వరకూ కాంగ్రెస్ తో ఉండి రిజల్ట్స్ రాకముందే బీజేపీలోకి జంప్ కొట్టారు కేసీఆర్. తీరా చూస్తే కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. మామూలుగా అయితే  వరస్ట్ డెసిషన్ అనాలి, కేసిఆర్ ని బూతులు తిట్టాలి. ఒక్కడూ మాట్లాడలేదు. అది పార్టీ పట్ల కమిట్ మెంట్, నాయకుడి మీద నమ్మకం.

ఇక టీడీపీ విషయానికి వస్తే, 2018 వరకూ NDA లో ఉండి ఇక బీజేపీ రాదనుకుని కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు చంద్రబాబు. అమిత్ షా మీద రాళ్లేసారు, మీటింగ్స్ పెట్టి. మోడీని బూతులు తిట్టారు. తీరా చూస్తే బీజేపీ ముందుకంటే మెజారిటీతో గెలిచింది. ఒక్కడైనా నీకు కనీస జ్ఞానం లేదు, తెలివితక్కువ వాడివి అందుకే ఇలా అయ్యింది అని బాబుని అన్నారా? ఇంకా విజనరీ అనే పొగుడుకుంటారు. ఇప్పటి పొత్తు నచ్చకపోతే కూడా పెట్టుకున్న బాబుని ఎవడూ ఏమీ అనరు కానీ పొత్తులో వున్న జనసేననో, బీజేపీనో తిడతారు తమ్ముళ్లు. 

వైసీపీని తీసుకోండి, బాబాయి ఎలా ఎందుకు చనిపోయాడో రాష్ట్రమంతా తెలుసు. అయ్య దోచిపెట్టిన సొమ్ములో వాటా అడిగిందనే తరిమేశాడని స్వయంగా చెల్లే చెబుతుంది. హంతకుడికి వోటేయకండి అని బాబాయి కూతురే దేశ రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతుంది. సొంతవారిని మెడబట్టుకుని గెంటేసి అయ్యనీ అమ్మనీ బూతులు తిట్టిన వారి కాళ్ళు పట్టుకుని పార్టీలో చేర్చుకున్నాడు. ఎన్ని చేసినా ఒక్కరు కూడా వాళ్ళ నాయకుడికి ఎదురు చెప్పరు. ఎదురు తిరిగిన చెల్లి, తల్లిని కూడా వీళ్ళు బండబూతులు తిడతారు, రంకులు అంటగడతారు. ఎన్నిచేసినా పార్టీ మీద నాయకుడి మీద పల్లెత్తు మాట మాట్లాడరు.

జనసేనాని నిజాయితీ, సేవాగుణం, నిబద్ధతలతో రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తారనే విషయం మనకు బాగా తెలుసు. పార్టీని నాయకుడిని విమర్శిస్తేనో, మీ ఆలోచనా పరిధి మేరకు సలహాలు ఇచ్చి అలా చేయడం లేదు అని అలిగితేనో అభిమానుల/సానుభూతిపరుల మీద కోపంరాదు. ఫ్యాన్/సానుభూతిపరుడిగా అది వారి రైట్. నిబద్దత కలిగిన పార్టీ కార్యకర్త అయితే అలా చేయరు.

మీరు పవర్ స్టార్ అభిమాని/సానుభూతిపరుడు, లేదా క్రమశిక్షణ కలిగిన కార్యకర్త  అన్నది మీరే నిర్ణయించుకోండి.👍


జై జనసేన! జై హింద్!!
- @sree_n_r               


PS: సిద్ధాంతాలు, భావజాలానికి అతీతంగా ఒక పార్టీ కార్యకర్త ఎలా వుంటాడో చర్చించాం. ఎలా వుండకూడదు అనేది ఒక జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలని చూసి నేర్చుకోవాలి. దీని గురించి ఇంకోసారి విఫులంగా చర్చిద్దాం.

Comments