జనసేనాని జన్మదిన శుభాకాంక్షలు 💐🙏

డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు ధర్నా చేశావే అప్పుడు నీలో లీడర్ని చూశాం. అందరూ భయపడే మీడియానే ఎదిరించిన నీ ధైర్యం నచ్చింది. సటిల్ గానే అయినా ప్రభావవంతంగా సినిమాల్లో నువ్వు చెప్పడానికి ప్రయత్నించే దేశభక్తి, యాంటీ ఈవ్ టీజింగ్, వంటి సందేశాలు హత్తుకున్నాయి.

ఒకరు నొచ్చుకుంటారేమో, ఏమైనా చేస్తారేమో అనే భయం నీకు లేదు. రాష్ట్రం భయపడే ఒక పార్టీ దాని నాయకుల అన్యాయాన్ని ఎదిరించి పంచెలూడదీసి కొట్టండి అని పిలుపునిచ్చిన నీ తెగువ, ధర్మాగ్రహం నచ్చింది

రాజకీయాలంటే ఒకడిని మించి ఒకడు దోచుకోవడం దాచుకోవడమే అనే
నిస్పృహలో వున్న మాకు చిన్న ఆశని, నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చావ్
నాలా లక్షలాదిమంది నీ వ్యక్తిత్వానికి, నిజాయితీకి, ధైర్యానికి అభిమానులం.

హరీష్ శంకర్ రాసినట్టు.. 

నీ వెనకున్న లక్షలాది ప్రజలు నీ ధైర్యం కాదు 
ఆ లక్షలాదిమందికి ముందున్న నువ్వే 
ధైర్యం ✊

మాకెందుకులే అని తలవంచుకు పోతున్న మమ్మల్ని మేల్కొలిపిన మా 
జనసేనానికి, మా అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు! 💐💐🙏🙏

Comments