ప్రచారం
వైసీపీ పార్టీ వారు, వారి జీతగాళ్ళు, సానుభూతిపరులు ఇవ్వాళ్టికీ సందు దొరికితే చాలు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకొని టీడీపీని గెలిపించాడు అని చెప్పుకుని సంతృప్తి పడిపోతుంటారు. 2014 లో తగిలిన దెబ్బ అలాంటిది మరి. నూటికి వందశాతం గెలుపు ఖాయం అనుకున్నది మోడీ వేవ్ పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అధికారం చేజారిపోయింది కదా?
మిస్సవుతున్న చిన్న లాజిక్
వైసీపీ ప్రచారం ప్రకారం 2014లో 500 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు దాన్నే ఇన్ఫ్లేషన్ కలిపి 1000 కోట్లు అని చెప్పుకుంటున్నారనుకోండి. అది వేరే సంగతి. ఒకవేళ 2014 లో ప్యాకేజీ తీసుకున్నదే నిజమైతే 2019లో ఎందుకు తీసుకోలేదు? పదేళ్లు అధికారంలో లేనప్పుడే అంత ఇచ్చారంటే, ఐదేళ్లు అధికారంలో వుండి 6 లక్షల కోట్లు (మళ్ళీ వైసీపీ చెప్పిన లెక్కలే ఇవి) దోచుకున్నోడు ఇంకెంత ఆఫర్ చేసుండాలి? మరి ఎందుకు అవి తీసుకుని మళ్ళీ సపోర్ట్ చేయలేదు? మునుపు తీసుకొనుంటే ఈసారి అంతకి మించి ఇవ్వజూపినా ఎందుకు వద్దంటాడు?
వీటికి జవాబుండదు. ప్రచారం మాత్రం చేస్తూనేవుంటారు.
తానొక ఎంపీ అనే విషయాన్ని మర్చిపోయి, అందరిమీద దిగజారుడు వ్యాఖ్యలు చేసే విజయసాయి రెడ్డి గారు ఇదే పాచిపోయిన పాట ఒక సభలో పాడుతూ వుంటే, ప్యాకేజీ తీసుకున్నట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం వుందా అని ఒక విలేఖరి అడిగాడు. ఒక్కసారిగా షాకయ్యి ,ప్రతీదానికీ ఆధారం వుండదు మనస్సాక్షికి తెలుసు అంటూ నీళ్లు నమిలారు. మేము మాత్రం ఇలాగే వాగుతాం అన్నారు.
టీడీపీ కొత్త పాట
వైసీపీ వాళ్లంటే చావుదెబ్బ తినడంవల్ల ఆ పగతో అలా మాట్లాడుతున్నారు అనుకుందాం. తెదాపాకి ఏం పోయేకాలం? వాళ్ళుకూడా ప్యాకేజీ అనడం ఎంత దిగజారుడుతనం? ఎవరు చంద్రబాబు గారు ఇచ్చారా ప్యాకేజీ అంటే మాట్లాడరు. అవును నేనే ఇచ్చా అని చంద్రబాబుని చెప్పమనండి, చూద్దాం. కాళ్ళు పట్టుకుని అధికారంలోకి వచ్చి, ఐదేళ్లూ దోచుకుని, మరో ఐదేళ్లు దోచుకోడానికి సహకరించలేదని విషం జిమ్మడం కంటే నీచం ఇంకోటుండదు. అయితే, టీడీపీకి చంద్రబాబుకి
ఇద్దరిలో ఎవరు ప్రమాదకరం?
నాగరాజు సర్పరాజుల్లో ఎవరు ఎక్కువ ప్రమాదం అంటే ఏం చెప్తాం? జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిగ్గానే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద చవకబారుగా మాట్లాడతారు. తానో ముఖ్యమంత్రి అని మర్చిపోయి స్థాయికి తగని వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి అతను తెలిసిన శత్రువు, జాగ్రత్తగానే ఉండొచ్చు.
చంద్రబాబునాయుడు గారు అలా కాదు. ఇవ్వాళ్టికీ ఆయన స్వయంగా పవన్ కళ్యాణ్ గారి మీద నెగటివ్ కామెంటు చేయరు. కలిసి వెళ్లే అవకాశం ఇంకా వుంది అని వీలున్నప్పుడల్లా చెబుతూనే వుంటారు. వెనుక తమ ఛానెళ్లతో పెయిడ్ ఆర్టిస్టులతో విష ప్రచారం చేయిస్తూనే వుంటారు.
ఇంటికొచ్చి మద్దతు అర్ధించిన పార్టీ తమ పనైపోగానే నీచ ప్రచారాలు, బజారు మనుషులతో ఛానెళ్లలో బూతులు తిట్టించడాలు, డబ్బులిచ్చి తల్లిని తిట్టించడాలు, స్టింగ్ ఆపరేషన్లు (పబ్లిగ్గా అందరినీ ఆహ్వానించి పెట్టిన పార్టీ మీటింగులో మహా మూర్తి ఆడించిన డ్రామా) ఇలా ఎన్ని నీచమైన పనులు చేశారో చూస్తూనే వున్నాం.
60:40 రాజకీయాలు
2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలిపోయి తమకి నష్టం రాకూడదనే వుద్దేశంతో జనసేన టీడీపీ ఒక్కటే అనే ప్రచారం చేసింది. ఇది తెలివైన రాజకీయ ఎత్తుగడ. అయితే, ఇక్కడే తెదాపా వారి వెన్నుపోటు రాజకీయం బయటపడింది. అవును మేమిద్దరం ఒకటే ఈసారి మాకు ఓటేయండి, వచ్చే ఎన్నికల్లో జనసేనకు వేయొచ్చు అని ప్రచారం చేసుకున్నారు. పశ్చిమ గోదావరిలో మెట్ల రమణ బాబు అనే టీడీపీ అభ్యర్థి ఓపెన్ గానే ఇలా విష ప్రచారం చేస్తూ దొరికారు.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు చెప్పినట్టు ఎమ్మెల్యే సీటుకి మాకు వేయండి, ఎంపీపీ సీటుకి వాళ్లకి వేయండి అని భీమవరం గాజువాకల్లో వైసీపీ టీడీపీ కలిసిపోయి పోటీ చేసారు.
2024 ఎన్నికల్లో..
వైసీపీ అధినేత ప్రభుత్వాన్ని పూర్తిగా దివాళా తీయించకుండా వుంటే 2024లో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. రోజు రోజుకీ పుంజుకుంటున్న జనసేన అప్పటికి పూర్తిగా నిలదొక్కుకుంటే వైసీపీ టీడీపీ కలిసిపోయి జనసేనమీద బాహాటంగానే పోటీ చేసినా ఆశ్చర్యం లేదు. కానిపక్షంలో తెరవెనుక కుమ్మక్కులు కొనసాగిస్తారు.
ముక్తాయింపు
వారి వారి ఆరోపణల్లోనే లక్షకోట్లు తినేసినోడు ఒకడు, ఆరున్నర లక్షల కోట్లు తినేసినోడు ఇంకొకడు. వీరి మధ్యలో ఎలాంటి అవినీతి మకిలి లేని మూడో వ్యక్తి వస్తే సహించలేక ఇలాంటి ఏడుపులు మొదలెట్టారని ఆయా పార్టీ సానుభూతిపరులే ఒప్పుకుంటారు.
తన తండ్రిని చంపేశారని రిలయన్స్ మీద దాడులు చేయించిన జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే వాళ్ళిచ్చే చిల్లరకి కక్కుర్తిపడి రాజ్యసభ సీటు వాళ్ళకే అమ్ముకున్నాడు. వైసీపీవాళ్ళకే కాదు సామాన్య ప్రజలందరికీ తెలిసిన నిజం ఇది. కానీ ప్యాకేజి స్టార్ అని పవన్ కళ్యాణ్ మీదే ఏడవాలి.
అదే మ్యాజిక్కు, అదే రాజకీయం.
❤️👏👏
ReplyDelete🙏
Delete❤️❤️❤️🙏🙏
ReplyDelete🙏
ReplyDeleteSpr sir keep it up....👍👍
ReplyDeleteThank you 🙏
DeleteSuper Sri...
ReplyDeleteGood explanation 👍
ReplyDelete