శ్లేష్మం మీద ఈగ


సుమారు పది పదిహేనేళ్ల క్రితం తెలుగు సినీ బ్లాగుల్లో "చిరంజీవి" కుటుంబం మీద ఏడుపుతో బతుకుదెరువు మొదలెట్టాడు ఈ వ్యక్తి. కొంతమంది వ్యతిరేకులు గుర్తించడం ప్రారంభించే సరికి మరింత వుత్సాహంతో అభిమానుల మనోభావాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే విద్యలో ఆరితేరిపోయాడు.

"పవన్ కళ్యాణ్" జనసేన పెట్టాక అయన వ్యక్తిత్వ హననం, వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీల దృష్టినాకర్షించాడు. కారెక్టర్ అస్సాసినేషన్ చేసి పార్టీల దగ్గరా వారి బాకా ఛానెళ్ల దగ్గరా చిల్లర తీసుకునేవాడు. కొందరు అభిమానులు, సానుభూతి పరులు ఎదురు దాడి చేశారు, ఇతనితో ఘర్షణ పడ్డారు. క్షమించమని వారితో అప్పటికి రాజీ పడ్డాడు. వాళ్ళు చల్లబడ్డ తర్వాత షరా మామూలే. వాళ్ళు ఎంత రెచ్చిపోయి తిరగబడితే అంత పలుకుబడి, డబ్బు వస్తాయని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్నాడు.

ఈ వ్యతిరేక ప్రచారం తమ యజమానులైన రాజకీయ పార్టీలకు ఉపయోగం అని భావించిన కొన్ని ఛానెళ్లు ఇతనికి నెల జీతం వుండడానికి క్వార్టర్స్ ఇచ్చి, తాగడానికి మందు పోసి మరీ తిట్టించాయని అప్పట్లో విమర్శలు వచ్చాయి.

ఈ దగుల్భాజీ వ్యవహారాలు చూసి చూసి విసుగొచ్చిన ప్రజలు ఆ ఛానెళ్లను చూడడం మానేశారు. దాంతో ఆ ఛానెళ్లు ఇతన్ని పోషించడం మానేశాయి. మరింత డోసు పెంచి పవన్ కళ్యాణ్ణి ఎంత నీచంగా మాట్లాడినా పెద్దగా స్పందన రాకపోవడంతో పునరాలోచనలో పడ్డాడు. పాపపు కూడుకు అలవాటు పడ్డ ప్రాణం గిలగిలలాడింది. ఈసారి ఇంకా పెద్ద టార్గెట్ ఎంచుకోవాలి, దెబ్బకి దేశమంతా తనపేరు మారు మ్రోగిపోవాలి అనుకున్నాడు.

కోట్లాది హిందువులున్న దేశంలో శ్రీరాముని కన్నా పెద్ద టార్గెట్ ఎవరుంటారు? సరిగ్గా క్లిక్ అయ్యి లిబరల్స్, యాంటీ హిందూ ఎలిమెంట్స్ దృష్టి నాకర్షించ గలిగితే లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోతుంది.
నెమలి తొడ అన్నాడు, ఉంపుడుగత్తెలతో సుఖించాడు అన్నాడు. పైగా, ఇదంతా పురణాల్లోనే వుంది అన్నాడు.

"నువ్వే సప్ప్లై చేసావా? అంత ఖచ్చితంగా చెప్తున్నావ్" అని అడిగిన వాళ్ళని ఇదిగో అణగారిన వర్గానికి చెందిన వాడిని కాబట్టి నన్ను అవమానిస్తున్నారు అని ఏడ్చాడు. ప్రజాగ్రహానికి భయపడి ఇతన్ని రాష్ట్ర బహిష్కారం చేసారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జనాలని రెచ్చగొట్టి తద్వారా సంపాదించే నీచపు కూడుని తినే "పరాన్నజీవులకి" ఇతను ఆదర్శం.


-- @sree_n_r

-----------

ఈ తరహా వ్యక్తులని వెదికి పట్టుకుని పోషించే ఒక రాజకీయపార్టీ తమ కండువా కప్పి ఇతన్ని సత్కరించింది. వారి ప్రాపకంతో చిన్నా చితకా వేషాలు కూడా వస్తున్నాయి. 20 లక్షల ఖరీదు చేసే ఇన్నోవాలో డ్రైవర్ని పెట్టుకుని మరీ తిరిగే ఈ వ్యక్తి, ప్రమాదానికి గురైనప్పుడు కేవలం నిర్లక్ష్యంతో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన గాయపడ్డాడు. ప్రభుత్వంలో వున్న సదరు రాజకీయపార్టీ విలువలకి తిలోదకాలిచ్చి రాష్ట్రానికి ఏ సంబంధం లేని వ్యక్తికి 17 లక్షలు ప్రజాధనం ధారపోయడం సర్వత్రా నిరసనకి గురైంది.

కాన్సర్ వంటి మహమ్మారులతో జీవన్మరణ పోరాటం చేస్తున్న ఎందరో చిన్నారులు సీఎం కేర్ ఫండ్ నించి ఆర్ధిక సాయంకోసం ఎదురుచూసి రాక ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారికి ఇవ్వని సాయం ఒక ఆర్ధికంగా బలమైన, ఏ రకమైన అర్హతలూ లేని వాడికి ఎలా ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్పాలి.

Comments

Post a Comment