వేటూరి గీతాలు

తెలుగు హృదయాలని కవ్వించి, ఏడ్పించి, గిల్లి, గిలిగింతలు పెట్టించిన వేటూరి గీతాలు


తెలుగు సినిమా ప్రియులకు పరిచయం అక్కరలేని పేరు శ్రీ వేటూరి సుందరరామమూర్తి గారు. వేలాది పాటలు వ్రాసి కోట్లాది ప్రేక్షకుల హృదయాలలో తిరుగులేని స్థానం సంపాదించుకున్న సినిమా కవి.



ఈ సందర్భంగా నాకు నచ్చిన గుర్తొచ్చిన కొన్ని మధుర గీతాలు. 

1. రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని
శిథిల జీవినైనానని
తొలకరి మెరుపుల లేఖలతో
రుధిర భాష్పజల దారలతో
విన్నవించు నా చెలికి
మనోవేదన నా మరణయాతన

ఆకాశ దేశాన, ఆషాడ మాసాన - మేఘ సందేశం.


2. రాయైతే నేమిరా దేవుడురాయైతే నేమిరా దేవుడు... హాయిగా ఉంటాడు జీవుడు...
ఉన్నచోటే గోపురం...  ఉసురులేని కాపురం
అన్నీ ఉన్న మహానుభావుడు...

శుభోదయం సినిమాలో చంద్రమోహన్ డాబా మీద పడుకొని బిర్లామందిర్ ని చూస్తూ పాడే ఈ పాట అంటే ఎందుకో చిన్నప్పటినుంచీ ప్రాణం. కొంచెం ethiesm టోన్ లో వుంటుందనేమో. 

3. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా...
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా...
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా ఊహల్లో తేలి ఉర్రూతలూగి...
మేఘాలతోటి రాగాల లేఖ నీకంపినాను రావా దేవి...

జాబిల్లికోసం ఆకాశమల్లే.. వేచాను నీ రాకకై, మంచిమనసులు.
సినిమా చూడలేదు ఇప్పటివరకూ కానీ పాట విన్న ప్రతీసారీ ఎదో ఆర్ధ్రత మెదులుతూ వుంటుంది. 



4. కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు...

అడవిరాముడు

5. శ్రీ చరణ మందార మధుపమ్మునై వ్రాలి
నిర్మల నిర్వాణ మధుధారలే గ్రోలి
భరతాభినయ వేద వ్రత దీక్ష పూని
కైలాస సదనా కాంభోజి రాగాన
నీ పద నర్తన సేయగా...ప ద ని

రాగం తానం పల్లవి
నా మదిలోనె కదలాడి కడ తేర మన్నవి
రాగం తానం పల్లవి


తెలుగువాళ్ళందరూ తప్పనిసరిగా చూసేసి వుండే సినిమా శంకరాభరణం. ఆ సినిమాలాగే ఆ పాటలు అజరామరం.

6. మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగా
ఆనంద వృష్టి నే తడవంగ

శంకరా నాద శరీరా పరా
వేద విహారా హరా జీవేశ్వరా శంకరా...


నిందా స్తుతి భారతీయులకే (అందులోనూ సనాతన ధర్మంలోనే) ప్రత్యేకమైనది. ఈ పాటలో/సినిమాలో  వేటూరిగారి కలం సోమయాజులుగారి నటన ఒకదానికి ఒకటి పోటీ పడతాయి. అలాగే బాలుగారి గళం, మహదేవన్ గారి సంగీతం అన్నిటికీమించి విశ్వనాధ్ గారి దర్శకత్వం అన్నీ కలిసి తెలుగు ఎవర్ గ్రీన్ టాప్ 10 లో ఈ సినిమాని నిలబెడతాయి.

ఎన్నో వేల పాటలు, వేటికవే ఆణిముత్యాలు. నిన్న 29 జనవరి ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకోవడం సంతోషదాయకం.

చూడాలని వుంది లో కలకత్తా మీద వ్రాసిన పాటతో ముగిద్దాం.



సరిమామగారి సససనిదపసా 

రిమదానిదాప సాసనిదప మదపమరి 
యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను 
మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను
మది యమహానగరి కలకత్తా పురి 
నమహో హుగిలీ హౌరా వారధి ..

Comments