మత మార్పిళ్లు

మత మార్పిళ్లు - స్లో పాయిజన్

ఈ మధ్య సోషల్ మీడియాలో మిత్రులు తాము చిన్నప్పుడు మిషనరీ స్కూళ్లలో చదివినా సరే తమ టీచర్లు ఇతర మతాలను ఎలా గౌరవించేవారో చెబుతుంటే చాలా ముచ్చటేసింది.





నా అనుభవంకూడా మీతో పంచుకోవాలి అని వ్రాస్తున్నా..

మా నాన్నగారి వృత్తి రీత్యా చిన్నప్పుడు ఒక్కో సంవత్సరం ఒక్కో వూళ్ళో చదివాను. 5 నుంచి మాత్రం వైజాగ్లోనే. అంతకుముందు కాకినాడలో మిషనరీ స్కూల్లో చదివినా ప్రేయర్ టైములో బైబిల్ కథలు తప్ప పెద్దగా ప్రచారం వుండేది కాదు.

ఆరో తరగతిలో అనుకుంటా కొత్త ఇంగ్లీషు మాస్టారు వచ్చారు. మొదటి రోజునుండీ ఆయన తన జీవిత అనుభవాలు, ఏసుక్రీస్తు తనను వివిధ సందర్భాలలో ఎలా కాపాడారు లాంటి కథలే చెప్పేవారు. ఒక కధ నాకు ఇప్పటికీ బాగా గుర్తు.

మాస్టారుగారు తన చిన్నప్పుడు ఎదో వూర్లో హాస్టలులో వుండేవారు. ఒకరోజు తినడానికి ఏమీలేదు, జేబులో పైసా లేదు. ఏం చేయాలో అర్ధంకాక ట్రంకు పెట్టె ముందు కూర్చుని కొంతసేపు ప్రార్ధన చేసి అప్పుడు పెట్టె తెరిచారు. అందులో ఒకమూల ఒక రూపాయి దొరికింది. ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుకొని రొట్టె కొనుక్కొని తినేశారు.

ఇలాంటి కధలతోనే టర్మ్ అంతా గడిచిపోయింది. పరీక్షలు వచ్చేసాయి. ఇంగ్లీషు పరీక్షకి ముందురోజు క్లాసులో అందరికీ పరీక్షలో వచ్చే ప్రశ్నలు వాటి సమాధానాలు చెప్పేశారు. మేమంతా హ్యాపీ, అలా ఆ పరీక్ష గడిచిపోయింది. ఇలాకాదు ట్యూషన్ చెబుతాను రండీ అంటే కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళాం. అసలే తెలుగు మీడియం, ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు కనీసం ట్యూషన్లో అయినా చెబుతారేమో అని ఇంట్లోవాళ్ళు కూడా పంపించారు.

ట్యూషన్లో అందరికీ పాకెట్ బుక్స్ వుచితంగా పంచారు. అవి క్రీస్తు కధల పుస్తకాలు. అక్కడా అవే బోధనలు. ట్యూషన్ నుంచి వచ్చాక ఇంట్లో చూసి చాల్లే అని మాన్పించేశారు. తరువాత మాస్టారు ఎందుకు రావట్లేదు అంటే చీకట్లో ఒక్కడినే రావాలంటే భయంవేస్తుందండీ అని చెప్పి తప్పించుకున్నా. అక్కడే కంటిన్యూ చేసిన మిత్రులు కొన్నాళ్ళకి మాస్టారు లాగే ప్రభువు కధలు చెప్పడం మొదలెట్టారు. తరువాత తెలిసిందేమిటంటే వాళ్ళిళ్ళల్లొ కూడా విషయం అర్ధమై మాన్పించేశారు అని.

ఇలా ఇంగ్లీషు చదువు అటకెక్కి తరువాత స్పీకింగ్ కోర్సులని అవనీ ఇవనీ నానా బాధలూ పడ్డాను. కాలేజీలో మిత్రుడు ఇంగ్లీషు నావెల్స్ పరిచయం చేయడం వల్ల కొంచెం మాట్లాడడం అర్ధం చేసుకోవడం అలవాటైంది.

విషయమేంటంటే, చాపకిందనీరులాగా దశాబ్దాల తరబడి అన్ని స్థాయిలలోనూ మత ప్రచారం మార్పిళ్లు జరుగుతున్నాయి. ఫలితమే తెలుగు రాష్ట్రాల్లో అనధికారంగా అన్నివర్గాల వారు క్రైస్తవంలోకి మారిపోవడం. ఆంధ్రప్రదేశ్ అయితే మరీ ఘోరం. కోస్తా జిల్లాల్లో అయితే SC, ST, BC, OC తేడాలు లేకుండా అన్ని వర్గాలు ప్రభావితమైనాయి. కొన్నేళ్లలో నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రం లాగా మారిపోయే అవకాశమే ఎక్కువగావుంది. 

క్రొత్తగా మతం మారే వాళ్ళు హిందూయిజం గురించి ఎంత నీచంగా మాట్లాడతారో మనలో చాలామంది వినే వుంటారు. ఉదాహరణకి హిందువులు పెట్టుకొనే బొట్టు గురించి చెప్పే కథ. వ్రాశాను కానీ నాకే అసభ్యంగా అనిపించి తీసేశాను.

దేవాలయ ఆస్తులు, దేవతా విగ్రహాల ధ్వంసం లాంటివి జరగడానికి బీజం ఇప్పటిది కాదు. దశాబ్దాల కృషి ఫలితమే ఇదంతా.


- శ్రీ             
@sree_n_r




Comments