Without beating around the bush, ఎంపీ అభ్యర్థి స్త్రీయో పురుషుడో కూడా తెలియకుండానే వోటేసేశానని చెప్పే ఓ వ్యక్తి మాటలు విని ఇలాంటివారివల్ల పార్టీ ఏమైపోతుందోనని బాధపడుతున్న జనసైనికులకి, తోటి జనసేన అభిమానులకి, సానుభూతిపరులకి:
నాకర్ధమైనంతవరకు, #PawanKalyan అనే వ్యక్తి ఎన్టీఆర్ కన్నా తెలివైనవాడు, చిరంజీవి కన్నా గడుసోడు, జగన్ కన్నా మొండోడు. ఎంతో ధైర్యంగా నిజాయితీతో తప్పులు జరుగుతాయి నేర్చుకుందాం అంటున్నాడు. అరచేతిలో వైకుంఠం చూపించడంలేదు. ఆయనకి ఆ అవకాశం ఇద్దాం. జరిగితే తప్పులే జరగొచ్చు. ప్రజలని మోసం చేయడం వెన్నుపోట్లు పొడవడం మాత్రం జరగవు.
నేను ఎన్టీ రామారావుగారి నుంచీ చాలామంది నాయకులని చూశాను. అందరిలోకీ పూర్తిగా సాంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడిన JP గారు నచ్చారు, కానీ మన దురదృష్టం ఈ రకమైన రాజకీయాలలో ఇమడలేక అయన వెళ్లిపోయారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇతన్నైనా కాపాడుకోవాలి.
గెలిస్తే ఆనందమే, కానీ స్వంత తప్పిదాలవల్లో ఇతరుల కుట్రలవల్లో ఓడిపోయినా బాధ లేదు. కనీసం ఒక నిజాయితీపరుడికి అండగా వున్నాం అన్న ఆనందమే ఉంటుంది.
మిత్రులు అనుమానిస్తున్నట్లు నిజాయితీపరుడు నెగ్గుకురాలేడు, 175 మంది కూడా PK లాంటి నిజాయితీపరులు దొరకరు అనేది నిజమే అయితే అది ఎంత బాధాకరమైన విషయం. స్వార్ధం వుండకూడదు అనట్లేదు. కానీ పార్టీని, రాష్ట్రాన్ని పణంగా పెట్టేంత స్వార్ధం అస్సలుండకూడదు. అది సమాజానికీ, దేశానికీ కూడా ప్రమాదకరం.
last words on this:
ఓడిపోతామని ఎందుకు భయం? ఓడిపోతే ఏమౌతుంది. ఇప్పుడున్నట్లే వుంటుంది. వాడుపోతే వీడు, వీడూ పోతే వాడి అమ్మ మొగుడు దోచుకుతింటుంటారు. కాకపోతే, మధ్యలో మన ఇగోస్ ఇంకొంచెం హర్ట్ అవుతాయి అంతే అంతకన్నా ఏం మునిగిపోదు.
ఒకవేళ గెలిస్తే మాత్రం మంచికోసం మార్పు ఖచ్చితంగా మొదలవుతుంది. అది గ్యారంటీ.
So, have faith and patience. మనలో కొందరు ఆదర్శంగా తీసుకుంటున్న బీజేపీ కూడా 2 సీట్లతో మొదలై 18 ఏళ్ళకి మొదటి ప్రభుత్వాన్ని స్థాపించింది. మళ్ళీ 10 ఏళ్ళు అధికారానికి దూరంగా వుండి ఇప్పటికి స్థిరమైన ప్రభుత్వాన్ని నెలకొల్పగలిగింది.
జనసేనాని పాతికేళ్ళు ఎవరూ లేకపోయినా ఒక్కడినే అయినా వుంటాను అంటున్నాడు. మనమూ తోడుగా వుందాం. నేనైతే ఖచ్చితంగా వుంటా, మీరు డిసైడ్ చేసుకోండి. చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతే ఎలా? ముందుముందు అసలైన సవాళ్ళను, నిజమైన తుఫానులను ఎదుర్కోవాలి. సిద్ధంగా వుండండి.
జై జనసేన! జై హింద్!!
శ్రీ
@sree_n_r
Comments
Post a Comment