ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు - Part1


నగనగా ఒక కచరా, ఒక జలగ, ఒక ఇటలీ దేవత పదేళ్ల క్రితం కలిసి తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసి దోచేసుకుందాం అని ప్లాన్ చేశారు. రాష్ట్రాన్ని విడదీసిస్తే పార్టీని మీతో కలిపేస్తాను అన్న కచరా 'నీకూ బే నీ అబ్బకూ బే' కలపను పో అని ఇటలీ దేవతని కాస్తా దెయ్యం అనేశాడు. గెలిచేశాననుకున్న జలగ కళ్యాణం తుఫానుకు కొట్టుకు పోయాడు. కచరా మాత్రం చేతికొచ్చిన ధనిక రాష్ట్రాన్ని ఐదు లచ్చల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసేశాడు. కాళేశ్వరం అనే ప్రాజెక్టు కూలీ నుంచి ఇంజినీరు, ఆర్కిటెక్టు వరకూ సర్వం తానై కట్టేశాడు. కిట్టని వాళ్ళు దోచేసిన లచ్చ కోట్లు చూసారుగానీ కట్టేసాడు పాపం అనుకోలేదు.

ఐదేళ్లు ఉగ్గబట్టుకున్న జలగ రెండోసారి గెలిచేసి కచరాకి పోటీగా ఐదేళ్లలోనే ఎనిమిది లచ్చల కోట్ల అప్పులు చేసి కాలర్ ఎగరేశాడు. ఎగస్పార్టీ వాళ్ళు ఇసుక, మద్యం, గంజాయి, బియ్యం మాఫియాలు నడిపాడు కానీ పాలన ఎక్కడుంది అన్నారు. రౌడీయిజం, అడిగిన వాడిని కొట్టడం, కుదరకపోతే చంపేయడం, చంపిన వాళ్ళని చేరదీసి తిప్పుకోవడం చేశాడు. 

మీ అయ్యని చూసి ఓటేస్తే మా బాగా బుద్ధి చెప్పావు అని ప్రజలు రెండు '11' నామాలు పెట్టారు. బడాయి కవుర్లు, బూతులు కాకుండా ఇంకేమైనా చేస్తాడేమో అని పదేళ్లు ఎదురు చూసిన జనం కచరాని కిందకి లాగేశారు. ప్రధానమంత్రి అయిపోతా మీ అందరి ఎన్నికల ఖర్చు నేనే పెట్టుకుంటా అని ఎగిరిన దొరకి శుభ్రంగా '0' సీట్లిచ్చారు.

అన్నట్టు ఇద్దరికీ సోషల్ మీడియాలో బూతులు తిట్టే  టీము ఒకటే, ఒకడే స్ట్రాటెజిస్టు, ఉమ్మడిగా వాడుకునే కార్లు బస్సులు. ఇప్పటికీ కచరా నోటి దురద తగ్గలేదు, జలగ చేతివాటం పోలేదు. దిగిపోయేముందు కూడా బెట్టింగ్ బాబులని నమ్మించి పందేల్లో కోట్ల రూపాయలు దోచేశాడు. (contd..)

Comments