చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా మేడ్ విజనరీ

1. శ్రీ చంద్రబాబు నాయుడు & ఎల్లో మీడియా


శ్రీ NT రామారావులా చంద్రబాబు స్ఫూరద్రూపి కాడు, వాక్చాతుర్యం లేదు,  తడబడకుండా మాట్లాడలేడు, కనీసం మోహంలో నవ్వూ కనబడేదికాదు. ఇన్ని ప్రతికూలతల మధ్య  ఆయనెలా విజనరీ  అయ్యాడో అందులో స్వంత సామజిక వర్గ మీడియా పాత్ర ఎంతుందో చూద్దాం.


2. 1995 లో ఎన్టీఆర్ ని పదవీచ్యుతుడ్ని చేసి (గిట్టనివారు వెన్నుపోటు అంటార్లేండి) తాను అధికారంలోకి రావడంలో ముఖ్య భూమిక ఆనాటి తెలుగు మీడియాదే.

ఎన్టీఆర్ అనాలోచితంగా అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం,  నాలుక కరుచుకుని వెనక్కు తీసుకోవడం అప్పటి వారికి బాగాతెలిసిందే.

3. తెలుగు మీడియా, ముఖ్యంగా ఈనాడు, దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబే రామారావు తీసుకునే తలతిక్క నిర్ణయాలను సర్దిచెప్పి పార్టీని కాపాడుతున్నాడని ప్రచారం చేసింది.

నాదెండ్ల చేసింది వెన్నుపోటు, చంద్రబాబు ఇతర కుటుంబ సభ్యులు చేసింది మాత్రం పార్టీని కాపాడడం అని నూరిపోసిందీ మీడియానే.

4. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగానే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే బిరుదు ఇచ్చేసింది మీడియా. అంతేకాదు, చంద్రబాబు సమర్ధత గురించి ఎంత నిజాయితీగా ఎఫెక్టివ్ గా వ్యవస్థలతో పని చేయిస్తున్నాడో అంటూ కధనాలతో రోజూ వార్తలు వచ్చేవి.

CEO of AndhraPradesh అనే కొత్త పదం సృష్టించి వాడటం మొదలుపెట్టారు

5. ప్రపంచంలో ఏనాయకుడు లైమ్ లైట్ లో కొచ్చినా వారితోపాటు సమయం సందర్భం లేకుండా చంద్రబాబుని కూడా కలిపి ప్రశంసించడం అనేది ఒక టెక్నిక్. తద్వారా చంద్రబాబు ఆ స్థాయి నాయకుడని అన్యాపదేశంగా చెప్పడమే అసలు లక్ష్యం.

దీనిని విజయవంతంగా మరియు నిశ్శబ్దంగా అమలు చేసిన మీడియా ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి.



6. ఈ టెక్నిక్ అర్ధమవ్వాలంటే ఆ మధ్య విడుదలైన అఖండ సినిమాని mainstream మీడియా ప్రోమోట్ చేసిన  మోసిన విధానం గమనించండి.

ఆ సంవత్సరం హిట్టయిన ప్రతీ సినిమాతోనూ అఖండని కలిపి ఈరెండూ హిట్  అని చెప్పడం ద్వారా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని ఇంజెక్ట్ చేయడమే ఇక్కడ కిటుకు.



7. 1995 సమయంలో IT విప్లవం మొదలయ్యింది. అప్పటికే నేదురుమల్లి జనార్ధనరెడ్డి శంకు స్థాపన చేసిన సైబర్ టవర్స్ ను చంద్రబాబు పూర్తి చేశారు

అయితే, బాబు చొరవ తీసుకుని మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలను హైద్రాబాదుకి రప్పించింది, దొరికిన అవకాశాలని అందిపుచ్చుకున్నారన్నది కాదనలేని నిజం



8. అయితే, బంగళూరు అప్పటికీ ఇప్పటికీ IT లో హైదరాబాద్ కన్నా ముందు వుందనేది నిర్వివాదాంశం. కానీ కర్ణాటక పాలకులు, మీడియా ఎప్పుడూ ఇదంతా మాఘనతే, మేము విజనరీలమని చెప్పుకోలేదు.

తెలుగు మీడియా, కొందరు ఆ సామజిక వర్గపు దురభిమానులు మాత్రం ఇప్పటికీ ఇదంతా చంద్రబాబు పెట్టిన భిక్షే అని చెబుతారు.


9. ఈనాడు ఇప్పటి జ్యోతి, సాక్షిల్లాగా వెగటు వచ్చేలా పొగడదు. కోడూరు పుష్ప, చినబాబు బులుగు చొక్కాల్లాంటివి  ప్రచురించేది కాదు.

విద్యావంతులు, మేధావులైన పాత్రికేయులు ఒక పధకం ప్రకారం చంద్రబాబే దేశాన్ని ముందుకు తీసుకుపోగలడు అని చాపకింద నీరులాగా ప్రచారం చేసేవారు. Subtlety is the key.


10. వీరి ప్రభావం ఎంతగా వుండిందంటే 2004లో వాజపేయి ప్రభుత్వం కేంద్రంలో ఓడిపోయిన దానికంటే రాష్ట్రంలో చంద్రబాబు ఓడిపోతే జనాలు ఎక్కువ బాధపడ్డారు.

ఆ దశలో రాజశేఖరరెడ్డి  ఏం చేసేస్తాడో అని భయపడ్డారు. అఫ్ కోర్స్, అదే ఈనాడు తరువాత రాజశేఖరరెడ్డి ఇమేజ్ ని కూడా అమాంతంలేపి బిల్డ్ చేసింది.
11. ఫాస్ట్ ఫార్వార్డ్ టు 2014.
ఎన్నికలకి ముందు మోదీ, పవన్ ల ప్రభావంతో పాటు మీడియా ప్రచారం కూడా బాగా పనిచేసింది.

అనుభవజ్ఞుడు క్లిష్ట పరిస్థితుల్లో వున్న రాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలడు అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించింది పసుపు మీడియానే.

12. ఇప్పటివరకు సటిల్  & సబ్ కాన్షస్ గా జరిగిన ఇమేజ్ బిల్డింగ్ నెమ్మదిగా సాక్షి & నీలిమీడియా లెవల్ కి పడిపోయింది. సాక్షి లాగే రోతరాతలు అసంబద్ధపు పొగడ్తలు మొదలెట్టాయి పచ్చ చానెళ్లు.

అప్పటి మేధావులైన పాత్రికేయులు రిటైర్ కావడం, నీలి మీడియా వారిని హెడ్ హంటింగ్ చేయడం కారణాలు కావచ్చు.

13. పదేళ్ల పాటున్న రాజధానిని రాత్రికి రాత్రే కేసుల భయంతో వదిలి  వచ్చేసినా, ఐదేళ్లు పూర్తయ్యినా నాలుగు టెంపరరీ బిల్డింగులు మాత్రమే కట్టినా, కాసేపు ప్యాకేజీ చాలని కాసేపు హోదాయే ముద్దని మాటలు మార్చినా..

బాబోరు ఏం చేసినా లోక కళ్యాణం కోసమేనని జనాలని నమ్మించడంలో మీడియా ఫెయిల్ అయింది.
14. చంద్రబాబు వల్లే ప్రత్యేకహోదా లేకపోయినా 20లక్షల పెట్టుబడులు వచ్చేశాయ్, చినబాబు పప్పు వండిపెట్టి విదేశీ పెట్టుబడులు వరదలా పారిస్తున్నాడు అనే కథలు విని జనం నవ్వుకున్నారు.

సోషల్ మీడియా వీరి ప్రతీ అబద్దాన్నీ ఎత్తిచూపించింది. బాబు కాగితపు పులి మాత్రమేనని ప్రపంచానికి పరిచయం చేసింది
15. తన భార్యని తిట్టారని బాబు మీడియా ముందుకు వచ్చి ఏడవడం  పచ్చ మీడియా చేసిన సరిదిద్దుకోలేని పొరపాటు.

ఇది పచ్చమీడియా డైరెక్షన్లో జరిగిందని చంటి పిల్లాడినడిగినా  చెబుతాడు.

సానుభూతి రాకపోగా చంద్రబాబు అనే వ్యక్తి చేష్టలుడిగిపోయి చేతులెత్తేశాడు అని ప్రజలకి చాటి చెప్పినట్టయింది.

16. ఈ సంఘటనతో బాబు మీద వుండే కాస్తో కూస్తో నమ్మకం కూడా పోయింది. పోనీ లోకేష్ ని పైకి లేపుదామంటే, అంతకంటే రాహుల్ గాంధీని లేపడం తేలిక అనే అభిప్రాయం మీడియాలోనే  వుంది.

అయితే మరీ 'బులుగు చొక్కా' లాంటి కధనాలు చూస్తే సొంత మీడియానే శకుని పాత్ర పోషిస్తుందేమోనని అనుమానం రాక మానదు.


17. ఏతావాతా ఒకప్పుడు తమ ఐకాన్ గా వున్న చంద్రబాబు గుదిబండగా మారడం అయన కొడుకునీ తప్పనిసరిగా మోయాల్సిరావడం కమ్మ సామాజికవర్గానికి పెనుభారమైంది.

'నెంబర్ టూ' అంటూ ఎవర్నీ రానీయక పోవడం తమరాజకీయ వునికినే ప్రమాదంలో పడవేసిందనేది వారు జీర్ణించుకోలేకపోతున్న చేదునిజం.

18. కష్టకాలంలో తోడుగా వుండే నాయకులు లేకపోవడం కూడా చంద్రబాబుకి శాపంగా మారింది. ఇప్పటి వైసీపీ నాయకుల్లో అధికులు గత టీడీపీ ప్రభుత్వంలో పదవుల్లో వున్నవాళ్ళే.

అప్పుడు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడినవాళ్ళే ఇప్పుడు నానాతిట్లూ తిడుతున్నారు. వీరితో తరలిపోయిన క్యాడర్ టీడీపీకి అదనపు నష్టం.




19. సోషల్ మీడియా పుణ్యమాని పచ్చమీడియా ముసుగు తొలిగిపోయింది. ఎప్పట్లానే బాబుని లేపే పరిస్థితి  ఇకలేదు.

బాబు కాలం చెల్లిన మనిషి, జగన్ లాంటి కర్కోటకుడిని ఎదుర్కొనే సామర్ధ్యం ఈ తండ్రీ కొడుకులకి లేదన్నది ప్రజలు గ్రహించారు.

మూడోతరంలో సమర్ధుడైన నాయకుడు లేకపోవడం పార్టీకి తీరని లోటు.

20. సోషల్ మీడియా పుణ్యమాని బాబు తింగరి మాటలు ఇప్పుడు జనానికి అర్ధమౌతున్నాయి. ఒకప్పుడు ఆకాశానికెత్తిన స్వంత మీడియా ఏమీ చేయలేక పోతుంది.

కమ్మవర్గపు మేధావులు, పెద్దలు ఈపరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి, ఒకప్పటి తమ వైభవాన్ని ఎలా తిరిగి పొందాలి అన్నది తెలీక తలలు పట్టుకునే పరిస్థితి.

21. జనసేనని తమతో కలుపుకుని అధికారంలోకి రావాలనే ఎత్తుగడ పారే సూచనలు లేవు, తమంతట తామే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.

తామే జనసేనతో కలిసి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అతనే ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో చేరడమొక్కటే ఆప్షన్.

ఇప్పటికి బతికితే తర్వాత నిలదొక్కుకోవచ్చనేది వారి మేధావుల  ఆలోచన.
Disclaimer: These are my observations as an individual. Not related to TDP, YCP, BJP or Janasena.

Thanks for reading 🙏
#Sree_thread

Twitter link: https://twitter.com/ForemostHuman/status/1594238898057539584
@sree_n_r





Comments