వైసీపీ వారి వర్గ శత్రువులు



మీడియాలో సంబంధం లేని పిచ్చి పిచ్చి లాజిక్స్ చెప్తున్నా, గ్రౌండ్ లెవెల్లో ఈ టికెట్లు, థియేటర్ల నాటకమంతా #PawanKalyan ని, ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రొడ్యూసర్స్ నీ దెబ్బకొట్టడానికే అని వైఛీపీ వాళ్ళు ఓపెన్ గానే చెబుతున్నారు.

#PawanKalyan ఆర్ధిక మూలాలు దెబ్బ కొట్టడానికే రేపు #VakeelSaab రిలీజ్ అనగా ఇవ్వాళ రాత్రి జీవోలిచ్చి ఇబ్బంది పెట్టారన్నది స్వయంగా వాళ్ళ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు చెప్పే మాటలు వింటేనే తెలుస్తుంది. సినీ రంగంలో యూనిటీ లేదు, రాదు అని తెలిసే నిస్సిగ్గుగా వేధిస్తున్నారు. 

ఒక వాదన ప్రకారం నిర్మాతలు, సినీ పెద్దలు జగన్ని అవమానించారు కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నాడు. చంద్రబాబుకి సత్కారాలు చేసి పైకి లేపే ఈ వర్గం ప్రొడ్యూసర్లు జగన్ని పట్టించుకోవడం లేదు. ఇది అవమానించడమే అని చెప్తున్నారు. 

ఇంకో వార్త నిర్మాత సురేష్ బాబు జగన్ని తిట్టాడు అందుకే ఎక్కువ థియేటర్లు వున్న సురేష్ బాబుని టార్గెట్ చేసాడు. ఏం తిట్టాడు అంటే మీకు తెలీదులే చాలా తిట్టాడు అంటున్నారు. 

నిజానికి వైజాగ్ బీచ్ ఏరియా లో రామానాయుడు స్టూడియో కోసం అప్పట్లో ఇచ్చిన స్థలాలని తిరిగి ఇచ్చేయమని అడిగాడు జగన్. సురేష్ బాబు ఒప్పుకోకుండా కోర్టుకి వెళ్ళాడు. దానికే పగబట్టి అతనికే ఎక్కువున్న థియేటర్ల మీద పడ్డాడు. ఒక్క సురేష్ బాబుని దెబ్బకొట్టడానికి మొత్తం ఇండస్ట్రీని ఎందుకు బాధ పెట్టడం అంటే సురేష్ బాబు ఒక్కడికోసమే జీవో తీసుకురాలేరు కదా అంటున్నారు. Collateral damage వుంటుంది అంట. 

ఇవేవీ కోర్టులో నిలబడవు అని వారికీ తెలుసు. జగన్ కి మొట్టికాయలు కొత్తా కాదు. కాబట్టి పై కోర్టుకి మళ్ళీ క్రింది కోర్టుకీ తిప్పుతూనే వుంటారు. మధ్యలో తనిఖీలని, ఇంకోటనీ వేధించడం బోనస్. రాష్ట్రంలో ఇంకేమీ సమస్యలు లేనట్టు కలెక్టర్ల నుంచీ మొత్తం వ్యవస్థ దీనిమీదే పనిచేస్తుంది. 

ఇవ్వాళ్టికీ రోడ్లు బాగుచేసేది లేదు, పక్క రాష్ట్రాలకంటే ఎక్కువ వున్న పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించేది లేదు. అవి తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ధరలూ తగ్గుతాయన్న తెలివి లేదు. అప్పులు తగ్గించి ఆదాయం పెంచే యోచన లేదు. పేదలకోసం సినిమా టికెట్లు కాదు, బస్సుచార్జీలు తగ్గించాలనే సెన్స్ లేదు. 

#PawanKalyan చెప్పినట్టు ఒక సామాజికవర్గాన్ని, ఒక పార్టీని వర్గశత్రువులుగా భావించి (మధ్యలో లక్షల కుటుంబాలు నలిగిపోయిన సరే), వారి అంతమే ధ్యేయంగా పనిచేస్తున్న రాష్ట్ర యంత్రాంగం ప్రజలకి మేలుచేస్తుందా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి


He is DESTROYING the state.

#JSPForNewAgePolitics 

Comments