Expiry date అయిపోయిన ఓ నటుడు ఈ మధ్యనే చాపెక్కి ఇండస్ట్రీకి తానే పెద్దమనిషిని అని తన పాలేరుతో చెప్పించుకున్నాడు. సదరు వ్యక్తి తెలుసుకోవాల్సిందేంటంటే ఎవరూ నేను పెద్దమనిషిని అయ్యాను నా దగ్గరకి రండీ అని ప్రచారం చేసుకోరు. ఒక వ్యక్తి గుణగణాలు, నడవడిక, మాట తీరు ఆదర్శప్రాయంగా వుండి తమ కష్టం వింటాడు వీలైనంతలో తీరుస్తాడు అనే నమ్మకం కలిగితే అతని దగ్గరకి వెళ్తారు. అలా పదిమందీ తమ కష్టనష్టాలు తీర్చే వ్యక్తిని పెద్దమనిషిగా గుర్తించి గౌరవిస్తారు.
సినిమా పరిశ్రమే కాదు యావత్ తెలుగు ప్రజలు గుర్తించిన అలాంటి వ్యక్తి గురించి కొత్తగా చెప్పేదేమీలేదు గానీ...
ఒకసారి నీ గురించి సింహావలోకనం చేసుకుందాం. ముందుగా మంచి చెప్పుకుంటే, ఒక చిన్న స్థాయి నుంచి మొదలయ్యి నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా నీఅభివృద్ధి బావుంది.
నీ బుద్ధి మాత్రం ఆదర్శనీయం కాదు..
మొదటి భార్య ఆత్మహత్య (?) చేసుకుంటే ఆమె చెల్లెల్ని చేసుకున్నావ్, కూతురు డ్రైవర్ తో లేచిపోతే రౌడీలతో కొట్టించావ్ లాంటివన్నీ పెర్సనల్ విషయాలు మాకు అనవసరం.
1. తల్లి వయసున్న ఒక సీనియర్ నటిని సరిగ్గా నడవలేకపోతున్నా పరిగెత్తించి కొట్టావు. ఆఖరికి ఆవిడ అప్పటి ముఖ్యమంత్రిని సీనియర్ నటుడుని కలిసి నీ బారినుంచి కాపాడమని వేడుకుంది.
2. నీ కొడుకు సినిమాలో నటిస్తున్న హీరోయిన్ని కొట్టావు. నీ దెబ్బకి ఇండస్ట్రీ వదిలేసి పారిపోయింది ఆ అమ్మాయి.
3. ఇండస్ట్రీలోనే అగ్రనటుడు ముఖ్యమంత్రిని అన్న వదిన అని చెప్పుకు తిరిగే నీవు ఆ అన్న చనిపోతే వదిన చాటుగా ఇచ్చిన సూట్ కేసులు పట్టుకుపోయావు. ఎన్ని వందల వేల కోట్లు పట్టుకుపోయావో తెలీదు. సదరు వదిన కూడా జనాల సొమ్మేకదా అని ఓ ఏడ్పు ఏడ్చి వూరుకుంది.
4. వజ్రోత్సవం సందర్భంగా దేశం గర్వించదగ్గ అగ్ర స్థాయి నటుడ్ని సన్మానిస్తుంటే, వందల మంది ముందు నీ కడుపుమంటని బయట పెట్టుకున్నావు. నీ కారణంగా పెంట కావలసిన కార్యక్రమాన్ని ఆయనే సర్దిచెప్పాడు.
5. నాకు సినీ జన్మ నిచ్చిన తండ్రి అని నువ్వు చెప్పుకునే అప్పటి ఇండస్ట్రీ పెద్ద చనిపోగానే కొడుకులకి, మనవలకి చెందాల్సిన ఆస్తి కొట్టేసావనే వార్తలు వున్నాయి. అతని కోడలే నీ బండారం బయటపెట్టింది.
6. నట సామ్రాట్ అని అందరూ గౌరవించుకునే దిగ్గజాన్ని సన్మానిస్తుంటే ఆయన కంటే నేనే గొప్ప నటుడ్ని అని అదే సభలో చెప్పుకుంటావు.
7. నీ బతుక్కి పక్క రాష్ట్రం సూపర్ స్టార్ చేసిపెట్టిన ఓ సినిమా, చనిపోయిన ముఖ్యమంత్రి నటించిన ఇంకో సినిమా తప్ప ఇవ్వాళ్టికీ చెప్పుకోడానికి ఇంకో దిక్కు లేదు.
... ...
ఇప్ప్పుడేదో ప్రాంతీయవాదం, కులవాదం, మతతత్వం(బీజేపీ?), రాజకీయం, ఓటర్లని ప్రలోభపెట్టడం, బెదిరించడం, రౌడీయిజం చేయడం, ఇంకా నానా ఛండాలం చేసి నీ కొడుకుని ఒక చిన్న అసోసియేషన్ కి ప్రెసిడెంటుగా గెలిస్తే ఏం మారిపోతుంది? ఏమీ మారదు. కనీసం నీ కుక్క బుద్ధికూడా మారదు.
CCTV ఫుటేజీ బయటకొస్తే బండారం బయటపడుతుందని ఇప్పుడు ఇవ్వనంటున్న ఆ ఎలక్షన్ కమిషనర్ నీ జేబులో మనిషి అనికూడా రుజువు చేసుకున్నాడు.
నీ విలువేంటో, స్థాయేంటో నీ కొడుకు ప్రమాణ స్వీకారం రోజే తెలిసింది. పెద్ద హీరోలు, సినిమా పెద్దలు పక్కన పెట్టు, ఒక మోస్తరు నటులు కూడా రాలేదు.
స్థూలంగా ఇదీ నీ బతుకు. నువ్వెంత ఏడ్చినా నిన్ను మనిషివా "మోహ__బు"వా అనే అంటారు.
@sree_n_r
Super bro
ReplyDeleteThanks brother 🙏
Deleteచాలా బాగా వ్రాసారు అన్నయ్య. 👏
ReplyDelete🩷🩷
Delete