ఊహ తెలిసే సరికే కీ|| శే|| శ్రీ వంగవీటి మోహన రంగాగారు హత్య గావింపబడ్డారు. ఆ(ఈ)నాటి లీడింగ్ పేపర్ చదివే అలవాటువల్ల ఆయన బెజవాడకి చెందిన ఒక రౌడీ అనే అభిప్రాయమే వుండేది. కృష్ణా గోదారి జిల్లాల్లో ఊరూరా రంగాగారి విగ్రహాలు చూసి కాపులు ఒక రౌడీని లేపుతున్నారు అన్న భావనే వుండేది. ఆయన ఒకప్పటి స్నేహితులు తర్వాత ప్రత్యర్ధులు అయిన దేవినేని వర్గాన్ని మాత్రం రౌడీలు అనరు. అదే మ్యాజిక్కు!
Social media, విజయబాబు గారు, మరికొందరు వివిధ సామాజిక వర్గాలనుంచి మతాల నుంచి వచ్చిన రంగాగారి సమకాలీనుల పుణ్యమా అని రంగాగారి అసలు వ్యక్తిత్వం తెలిసింది బడుగు బలహీన వర్గాలపట్ల ఆయనకున్న ప్రేమ, తపన, అభిమానం అర్ధమయ్యాయి! 🙏
అమరులయ్యి ఇన్నేళ్ళయినా ప్రజల గుండెల్లో ఆయన పట్ల గూడు కట్టుకున్న ప్రేమ నభూతో నభవిష్యతి! 🙏 ఈనాటికీ ఆంధ్రా జిల్లాల్లో రంగా గారి పేరు వింటే జనాల్లో విశేషమైన స్పందన. ఏ కారణం లేకుండానే దాదాపు 40 ఏళ్లతర్వాత కూడా ఇంత అభిమానం వుంటుందా?
శ్రీ #PawanKalyan గారు అడిగినట్లు, ఆయన సభలకు ఇసుకేస్తే రాలనంత వచ్చే జనం, ఆయనను హత్య చేస్తారు అని తెలిసీ ఎందుకు కాపాడుకోలేక పోయారు? రంగా గారి అనుచరులందరూ చంపేస్తారని ముందే తెలుసు అన్నారు. మరెందుకు ఏమీ చేయలేకపోయారు. పొరపాటు ఎక్కడ జరిగింది? అప్పటికే చేతులెత్తేశారా? బలీయమైన రాజకీయ పక్షాల ఒత్తిడులకి లొంగిపోయి రంగాగారిని బలిచేశారా? అలాంటి పొరపాటు ఇకపై జరక్కుండా ఎలా సరిదిద్దుకోవాలి?
మళ్ళీ ఇన్నేళ్లకి అంతే నిబద్దత వున్న వ్యక్త్రి అంతకంటే మొండి మనిషి వచ్చాడు. తమ ఆధిపత్యాన్ని గండికొట్టే సత్తావున్న నాయకుడు వచ్చాడంటే అధికార ప్రతిపక్షాలు ఏకమై ఎంతకైనా దిగజారిపోతారు. వ్యక్తిత్వహననానికి పాల్పడడం, కిరాయి మనుషులతో బురద చల్లడం, ఇంటి ఆడపడుచులని అవమానించడం, యిలా ఏ నీచానికైనాతెగిస్తారు.
మరోసారి అదేపొరపాటు పునరావృతం కానీయొద్దు. ఈసారి నాయకుడిని కాపాడుకుందాం. భవిష్యత్తుని నిర్మించుకుందాం.
నలభై ఏళ్ళనుంచీ దోచుకోవడం దాచుకోవడం అడ్డొచ్చిన వాళ్ళని అంతమొందిచడం అనే ఏకైక పాలసీతో పాలిస్తున్న రెండు కుటుంబాలనుంచి రాష్ట్ర్రాన్ని కాపాడగలిగేది ఒక్కడే!!
'పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి' శ్రీ పవన్ కళ్యాణ్!
మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడదాం, నిలబెడదాం ✊
#JSPForNewAgePolitics
- @sree_n_r
Comments
Post a Comment