సన్నాసుల్లారా...


సాక్షాత్తూ షీఎం అసెంబ్లీలో వంకరగా మాట్లాడతాడు..

స్పీకర్ ఒక ప్రధాన జాతీయ పార్టీ అధ్యక్షురాలిని బండ బూతులు తిడతారు.

ఒక ఎమ్మెల్యే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని %$#కొడుకు అంటాడు.

మరొక ఎమ్మెల్యే ప్రశ్నించిన యువకుడిని &కా అని గ్రామీణ భాషలో ఆశీర్వదిస్తాడు.

ఇక గుడివాడ బూతులింగం అయితే అది నోరు కాదు ఎడతెగక పారే సుజల స్రవంతి! బాబోరుని ఎన్ని అమ్మనాబూతులు తిట్టినా తుమ్మ తమ్ముళ్లు కిమ్మనరనుకోండి, అది వేరే కథ.

ఇంత సాధికారంగా మీ గ్రామీణభాషని రాజభాష చేసిన మీరు కేవలం సన్నాసుల్లారా అన్నందుకు ఎందుకు గుడ్డలు చింపుకుంటున్నారు?

మీరు వాడితే వినసొంపుగా వున్న మాటలు మిమ్మల్ని అంటే కర్కశంగా అయిపోయాయా?

నువ్వు అసెంబ్లీలోనే నలుగురు పెళ్లాలనొచ్చు, మేము బయటకూడా ముగ్గురు బావలనకూడదు.

మీరు అమ్మల్ని అక్కల్ని శ్రవణానందకరంగా దీవించొచ్చు, మేము దద్దమ్మలు అనికూడా అనకూడదు.

... ...

ఇంతకీ అన్నది సన్నాసులనే కదా? అర్ధం తెలియకపోతే వివరిస్తా వినండి.

పూర్వకాలంలో సర్వం పరిత్యజించిన సత్యాన్వేషులని 'సన్యాసులు' అనేవారు. రాను రానూ ఏ పనీ చేయకుండా తిరిగేవారిని వెటకారంగా సన్యాసులనడం మొదలెట్టారు. అదే వాడుక భాషలో సన్నాసులయ్యింది.

మీరు ఏ పనీ చేయకుండా పనికిమాలిన వాళ్ళలాగా తిరుగుతున్నారని సన్యాసులు/సన్నాసులు అంటున్నారు. నిజమేకదా,  పెద్దగా ఫీలవకండి!!

ఇక దద్దమ్మలు అంటే ఏంటి అనే డౌట్ ఉంటే మా తెలంగాణా బాపు కెసిఆర్ ని అడగండి. సక్కగా వివరిస్తాడు!

రాష్ట్రాన్నేలుతున్న సన్నాసి సంఘం వర్ధిల్లాలి!!



 

Comments