అన్న అమ్మేశాడు ఇప్పుడు తమ్ముడొచ్చాడు - రాండమ్ జనం
మీరు ఫాన్స్ కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు - స్వయంప్రకటిత మేధావులు
మీకు ఒక స్టాండ్ లేదు - పొద్దున్న ఒకపార్టీ సాయంత్రం ఇంకోపార్టీకి మద్దతిచ్చే దొర అనుచరులు
పవన్ కాపుల పరువు తీశాడు - కాపు పెద్దలు
ప్యాకేజి స్టార్ - దోచుకోవడమే ఏకైక సిద్ధాంతంగా వున్న ఒక పార్టీ పెయిడ్ బ్యాచ్
మీకు సిద్ధాంతాలు లేవు - మన సపోర్ట్ తోనే అధికారం సాధించిన పార్టీ అభిమానులు
వీళ్ళు తప్పని ఋజువు చేయడానికి, జనం నమ్మి వెంట రావడానికి
నువ్వు పాతికేళ్ల ప్రస్థానం అని ఎందుకన్నావో మాకు అర్ధం కావడానికి
ఉత్తర దక్షిణ ధృవాలని కలిపి కూటమిగా కూర్చిన నీ మొండి పట్టుదల
నేడు కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టిన "నీ స్థాయి వేరు నీ స్థానం వేరు"
అవును పదేళ్లు పట్టింది..
నువ్వు మాకర్థం కావడానికి 🙏
అయితే.. అంతం కాదిది ఆరంభం!
హుందాతనం, భాద్యత, జవాబుదారీతనం మర్చిపోయి
వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాలమీద మాత్రమే బతికే
కుహనా రాజకీయ నాయకులకి మేలుకొలుపు!
జనసేన, సరిక్రొత్త రాజకీయం!
Comments
Post a Comment